Skip to main content

Featured post

కళ్లుచెదిరే ఆఫర్‌.. కనీవినీ ఎరుగని రాయితీ...... upto 75%

ఆర్టీసీ కార్మికులకు నెలకు రూ. 50 వేల జీతం వస్తోందా?

ఆర్టీసీ ఉద్యోగుల జీతాలెంతో తెలుసా?



  • ఆర్టీసీ సమ్మె మొదలై రోజులు గడుస్తున్నాయి.
  • ప్రభుత్వం మొండి పట్టుదల వీడటం లేదు. కార్మికులు సైతం అంతే పట్టు వదలకుండా తమ హక్కుల సాధనకోసం బెట్టు మీద ఉన్నారు.
  •  ఆర్టీసీ ఉద్యోగుల జీత, భత్యాలపై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
  • 50వేల వరకూ జీతాలు అందుకుంటున్నారన్న ప్రభుత్వ పెద్దల అసత్య ప్రచార హోరులో సామాన్యులు నిజంగానే ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు నాలుగంకెలు దాటాయన్న భ్రమాజనిత వార్తలు సందడి చేస్తున్నాయి.
  • ఈ నేపథ్యంలో ‘‘SwamyWay’’ ఆర్టీసీ ఉద్యోగుల జీత, భత్యాలకు సంబంధించిన వాస్తవ గణాంకాలు మీ ముందుంచుతోంది.



ఆర్టీసీ కార్మికులకు నెలకు రూ. 50 వేల జీతం వస్తోందా?


పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వస్తున్న వేతనాలెంత? ఈ అంశాలను పరిశీలిద్దాం.

ఉమ్మడి ఏపీలో ఆర్టీసీ కార్మికులకు, సిబ్బందికి 2013లో వేతనాల పెంపు జరగాల్సింది. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కారణంగా వేతనాల పెంపు వాయిదా పడింది.
 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో 44% ఫిట్‌మెంట్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించారు
ఫిట్ మెంట్ పై తీసుకుంటున్న నిర్ణయాన్ని మొత్తం జీతంమీద కాకుండా కేవలం బేసిక్ పేపై ఈ 44% ఫిట్‌మెంట్ పెరిగింది
పదేళ్ళ సీనియారిటీ ఉన్న తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ మూల వేతనం రూ. 16,650 అయితే హెచ్ఆర్ఏ, డీఏ తదితరాలన్నీ కలుపుకుని ‘గ్రాస్ పే’ రూ. 33,512 మాత్రమే. ఇందులో పీఎఫ్, సొసైటీ నుంచి తీసుకున్న రుణం, వృత్తి పన్ను కటింగ్ పోతే చేతికి వచ్చే ‘నెట్ పే’ రూ. 20,713 మాత్రమే.
 అంటే అన్ని భత్యాలు కలుపుకున్నా పదేళ్ళ సీనియారిటీ ఉన్న డ్రైవర్ వేతనం రూ. 35 వేలు మాత్రమే. 
కానీ సీఎం కేసీఆర్ మాత్రం రూ. 50 వేల ‘సగటు’ వేతనంగా ప్రకటించారు.
ఆర్టీసీ అధికారి స్థాయి మొదలు దిగువన ఉండే హెల్పర్ వరకు అన్ని రకాల హోదాల్లో ఉండే కార్మికులందరి వేతనాలను సగటుగా తీసుకుంటే ఆ లెక్కే వస్తుంది కాబోలు! 
కానీ ఆర్టీసీలోని మొత్తం సుమారు 49 వేల మంది ఉద్యోగుల్లో మూడొంతుల మంది డ్రైవర్లు, కండక్టర్లే. ప్రతీ నాలుగేళ్ళకోసారి వేతనం పెంచాల్సి ఉన్నందున 2013లో పెరగాల్సిన వేతనం 2015లో పెరిగినందున తదుపరి 2017లో పెరగాల్సి ఉంది. కానీ ఆ విధంగా జరగలేదు. 
ఇప్పుడు వేతనాల పెంపు గురించి కార్మికులు సమ్మె డిమాండ్లలో ఒకటిగా పెట్టారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం 


”ఆర్టీసీ యూనియన్లు అతి ప్రవర్తనతో… తాము ఎక్కిన చెట్టు కొమ్మను తామే నరుక్కున్నారు
. గత నలభై ఏండ్లుగా జరుగుతున్న దాష్టీకం వల్ల ఇదంతా చేయాల్సి వచ్చింది. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలలో సమ్మె చేసిన ఆర్టీసీ యూనియన్లు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సమ్మెకు దిగాయి.

నిజానికి సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు వేతనాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వేర్వేరుగా చూస్తూ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు చెల్లిస్తున్న వేతనాలను పరిశీలిద్దాం. 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో ‘ఎంట్రీ లెవల్’ 
డ్రైవర్ మూల వేతనం                     రూ. 13,780, 
కండక్టర్ మూల వేతనం                  రూ. 12,610.
 ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎంట్రీ లెవల్’ 
డ్రైవర్ మూల వేతనం             రూ. 21,390,
 కండక్టర్‌కు                               రూ. 19,580.
మహారాష్ట్రలో‘ఎంట్రీ లెవల్’ 
డ్రైవర్ మూల వేతనం              రూ. 17,130. 

అంటే పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోని డ్రైవర్లు, కండక్టర్లకే తక్కువ వేతనాలు ఉన్నాయి.
బహుశా ప్రభుత్వం కోరుకున్నది కూడా అదే. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడాలన్న ఉద్దేశంతో ఈ వ్యాఖ్య చేయడంతో సహజంగానే ఆ అభిప్రాయం కలగకమానదు. ఆ మేరకు ప్రభుత్వం విజయం సాధించినట్లయింది. 

పదేళ్ళ అనుభవం (సర్వీసు) ఉన్న డ్రైవర్‌కే అన్ని అలవెన్సులూ కలుపుకుని రూ. 35 వేలు దాటడంలేదంటే ఇక రూ. 50 వేతనం అందుకుంటున్నారనడంలో అర్థం లేదు. ....


Comments

Post a Comment

Popular posts from this blog

సమ్మక్క , సారాలమ్మ జాతర ప్రారంభం సమ్మక్క , సారాలమ్మ విశేషాలు

సమ్మక్క , సారాలమ్మ జాతర ప్రారంభం సమ్మక్క , సారాలమ్మ విశేషాలు    *16 వ తేదీన సారలమ్మ , పగిడిద్దరాజు , గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.*  *17 వ తేదీన సమ్మక్క తల్లి గద్దెపై కొలువు తీరుతుంది .* *18 వ తేదీన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.*  *19 వ తేదీన దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.*  ☘సమ్మక్క మేడారం ఎలా వచ్చింది ?☘ ‘‘పుట్టు భయ్యక్క పేట పురమందు వెలసినా ఆ చందా పరుమయ్యా ఆ యింటి సమ్మక్క.’’ సమ్మక్క భయ్యక్కపేటలో పుట్టింది. ‘చందా’ అనే పేరు గల పరుమయ్య ఇంట్లో ఉండేది. ప్రస్తుతం గుడి బయ్యక్కపేటలో ఉంది. *‘బయ్యక్కపేటలో ఉండలేను. మేడారం పంపించమని’* కోరుతుంది. ‘చందా’ పరుమయ్య మేడారం గ్రామం వచ్చి (మేడారానికి బయ్యక్కపేట 10 కి.మీ దూరంలో ఉంటుంది.) అక్కడి గ్రామ తల్పతి (కులపెద్ద), వడ్డె (పూజారి), అర్థి బిడ్డతో (ఆక్షిశితులను) మాట్లాడి సమ్మక్క *‘బయ్యక్కపేటలో ఉండను’* అంది. కాబట్టి , మేడారం తీసుకెళ్తున్నానని 3 వ గోత్రికం ‘కొక్కెర’ అను ఇంటి పేరు గలవారిని , 5 వ గోత్రికం ‘సిద్ధబోయిన’ అనే ఇంటి పేరుగల వారిని వడ్డెలు ఒప్పించి మేడారంలో దించి పోతాడు. ఆనాటి నుండి ఇప్పటివరకూ వా...

NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే

NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే NTPC Recruitment 2019-20 | దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్ www.ntpccareer.net ఫాలో కావాలి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 స్కోర్ ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఎన్‌టీపీసీలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 10న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్  NTPC careers ;&nbsp ఫాలో కావాలి. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఎన్‌టీపీసీ జారీ చేసిన షార్ట్ నోటిఫికేషన్ కోసం  ఇక్కడ క్లిక్ చేయండి. NTPC Recruitment 20...

సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

*AISSEE 2022 : సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.... వివరాలు ఇలా* *దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది* *ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేషన్‌ ద్వారా ఆరోతరగతి, తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు.* *ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.* *దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 27, 2021 నుంచి ప్రారంభమవుతుంది.*  *దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 26, 2021 వరకు అవకాశం ఉంది.* *ప్రవేశ పరీక్ష (Entrance Test) జనవరి 9, 2022న నిర్వహిస్తారు.* *పరీక్ష ఫీజు ( Exam Fee) నోటిఫికేషన్‌, దరఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సందర్శించండి.* *ముఖ్య సమాచారం* *దరఖాస్తు ప్రారంభం :  సెప్టెంబర్ 27, 2021* *దరఖాస్తకు చివరి తేదీ : అక్టోబర్ 26, 2021* *సవరణలకు అవకాశం : అక్టోబర్ 28, 2021 నుంచి నవంబర్ 2, 2021* *పరీక్ష ఫీజు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.4...