ఆర్టీసీ ఉద్యోగుల జీతాలెంతో తెలుసా?
- ఆర్టీసీ సమ్మె మొదలై రోజులు గడుస్తున్నాయి.
- ప్రభుత్వం మొండి పట్టుదల వీడటం లేదు. కార్మికులు సైతం అంతే పట్టు వదలకుండా తమ హక్కుల సాధనకోసం బెట్టు మీద ఉన్నారు.
- ఆర్టీసీ ఉద్యోగుల జీత, భత్యాలపై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
- 50వేల వరకూ జీతాలు అందుకుంటున్నారన్న ప్రభుత్వ పెద్దల అసత్య ప్రచార హోరులో సామాన్యులు నిజంగానే ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు నాలుగంకెలు దాటాయన్న భ్రమాజనిత వార్తలు సందడి చేస్తున్నాయి.
- ఈ నేపథ్యంలో ‘‘SwamyWay’’ ఆర్టీసీ ఉద్యోగుల జీత, భత్యాలకు సంబంధించిన వాస్తవ గణాంకాలు మీ ముందుంచుతోంది.
ఆర్టీసీ కార్మికులకు నెలకు రూ. 50 వేల జీతం వస్తోందా?
ఉమ్మడి ఏపీలో ఆర్టీసీ కార్మికులకు, సిబ్బందికి 2013లో వేతనాల పెంపు జరగాల్సింది. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కారణంగా వేతనాల పెంపు వాయిదా పడింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో 44% ఫిట్‌మెంట్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఫిట్ మెంట్ పై తీసుకుంటున్న నిర్ణయాన్ని మొత్తం జీతంమీద కాకుండా కేవలం బేసిక్ పేపై ఈ 44% ఫిట్మెంట్ పెరిగింది.
పదేళ్ళ సీనియారిటీ ఉన్న తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ మూల వేతనం రూ. 16,650 అయితే హెచ్ఆర్ఏ, డీఏ తదితరాలన్నీ కలుపుకుని ‘గ్రాస్ పే’ రూ. 33,512 మాత్రమే. ఇందులో పీఎఫ్, సొసైటీ నుంచి తీసుకున్న రుణం, వృత్తి పన్ను కటింగ్ పోతే చేతికి వచ్చే ‘నెట్ పే’ రూ. 20,713 మాత్రమే.
అంటే అన్ని భత్యాలు కలుపుకున్నా పదేళ్ళ సీనియారిటీ ఉన్న డ్రైవర్ వేతనం రూ. 35 వేలు మాత్రమే.
కానీ సీఎం కేసీఆర్ మాత్రం రూ. 50 వేల ‘సగటు’ వేతనంగా ప్రకటించారు.
ఆర్టీసీ అధికారి స్థాయి మొదలు దిగువన ఉండే హెల్పర్ వరకు అన్ని రకాల హోదాల్లో ఉండే కార్మికులందరి వేతనాలను సగటుగా తీసుకుంటే ఆ లెక్కే వస్తుంది కాబోలు!
కానీ ఆర్టీసీలోని మొత్తం సుమారు 49 వేల మంది ఉద్యోగుల్లో మూడొంతుల మంది డ్రైవర్లు, కండక్టర్లే. ప్రతీ నాలుగేళ్ళకోసారి వేతనం పెంచాల్సి ఉన్నందున 2013లో పెరగాల్సిన వేతనం 2015లో పెరిగినందున తదుపరి 2017లో పెరగాల్సి ఉంది. కానీ ఆ విధంగా జరగలేదు.
ఇప్పుడు వేతనాల పెంపు గురించి కార్మికులు సమ్మె డిమాండ్లలో ఒకటిగా పెట్టారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం
”ఆర్టీసీ యూనియన్లు అతి ప్రవర్తనతో… తాము ఎక్కిన చెట్టు కొమ్మను తామే నరుక్కున్నారు
. గత నలభై ఏండ్లుగా జరుగుతున్న దాష్టీకం వల్ల ఇదంతా చేయాల్సి వచ్చింది. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలలో సమ్మె చేసిన ఆర్టీసీ యూనియన్లు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సమ్మెకు దిగాయి.
నిజానికి సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు వేతనాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వేర్వేరుగా చూస్తూ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు చెల్లిస్తున్న వేతనాలను పరిశీలిద్దాం.
డ్రైవర్ మూల వేతనం రూ. 13,780,
కండక్టర్ మూల వేతనం రూ. 12,610.
ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎంట్రీ లెవల్’
డ్రైవర్ మూల వేతనం రూ. 21,390,
కండక్టర్‌కు రూ. 19,580.
మహారాష్ట్రలో‘ఎంట్రీ లెవల్’
డ్రైవర్ మూల వేతనం రూ. 17,130.
అంటే పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోని డ్రైవర్లు, కండక్టర్లకే తక్కువ వేతనాలు ఉన్నాయి.
బహుశా ప్రభుత్వం కోరుకున్నది కూడా అదే. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడాలన్న ఉద్దేశంతో ఈ వ్యాఖ్య చేయడంతో సహజంగానే ఆ అభిప్రాయం కలగకమానదు. ఆ మేరకు ప్రభుత్వం విజయం సాధించినట్లయింది.
Super sir
ReplyDelete