NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే
NTPC Recruitment 2019-20 | దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్ www.ntpccareer.net ఫాలో కావాలి.
ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 స్కోర్ ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఎన్‌టీపీసీలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 10న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్ NTPC careers; 
ఫాలో కావాలి. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఎన్‌టీపీసీ జారీ చేసిన షార్ట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
NTPC Recruitment 2019-20: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...
పోస్ట్ పేరు: ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్
విద్యార్హత: బీఈ లేదా బీటెక్. గేట్ 2020 స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్ చేస్తారు.
Comments
Post a Comment