Skip to main content

Featured post

కళ్లుచెదిరే ఆఫర్‌.. కనీవినీ ఎరుగని రాయితీ...... upto 75%

బతుకమ్మ పండుగలో రోజుకొక్కో రకమైన ప్రత్యేక నైవేద్యం

తెలంగాణలో బతుకమ్మ పండుగకు  ప్రసిద్ధమైంది. అమావాస్య నాడు ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కోక రకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు.
ఈ సంవత్సరం అధిక ఆశ్వీయుజ మాసం రావడం వలన ఈ పండగను నిజ ఆశ్వీయుజ మాసం ప్రారంభంతో జరుపుకుంటారు. 16 అక్టోబర్ 2020శుక్రవారం, అమావాస్య రోజు  ఎంగిలి పువ్వు బతుకమ్మని పేరుస్తారు. అమావాస్య నుండి 24 అక్టోబర్ శనివారం రోజు సద్దుల బతుకమ్మని "దుర్గాష్టమి" మహర్నవమిగా వేడుక చేసుకుంటారు. ఈ బతుకమ్మ పండగ ప్రాంతాల వారిగా భిన్న ఆచార వ్యవహారాలుగా కొనసాగుతుంది.

 16 అక్టోబర్ 2020శుక్రవారం, అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మ - నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు.
 17 అక్టోబర్ 2020 శనివారం రోజు అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు చేస్తారు. ( దేవి శరన్నవరాత్రులు ప్రారంభం )  సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

 18 అక్టోబర్ 2020 ఆదివారం రోజు ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు.

 19 అక్టోబర్ 2020 సోమవారం రోజు నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి.

 20 అక్టోబర్ 2020 మంగళవారం రోజు అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.

 21 అక్టోబర్ 2020 బుధవారం రోజు అలిగిన బతుకమ్మ : ఈ రోజు నైవేద్యం సమర్పించరు.

 22 అక్టోబర్ 2020 గురువారం రోజు వేపకాయల బతుకమ్మ : బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

 23 అక్టోబర్ 2020 శుక్రవారం రోజు వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేస్తారు.

 24 అక్టోబర్ 2020 శనివారం రోజు సద్దుల బతుకమ్మ :  ఆశ్వీయుజ అష్టమి రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి.

తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేస్తారు. మేళతాళలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మలో కలుపుతారు. పూలతో తయారు చేసిన బతుకమ్మపై పసుపుతో తయారు చేసిన గౌరవమ్మను మహిళలు తమ మంగళ సూత్రాలకు పూసుకుంటారు. దీనివల్ల తమ మాంగళ్యం అంటే తమ భర్తను ఆపదల నుంచి కాపాడి చల్లగా చూస్తుందని నమ్మకం. రొట్టె, బెల్లం లేదా చక్కెర కలిపి తయారు 'మలీద'ను అందరికీ పంచితే శుభం జరుగుతుంది.

మలిద లడ్డు తయారు చేయువిధానం:-

మలిద లడ్డు- కావాల్సిన పదార్థాలు.
గోధుమ పిండి ఒక కప్పు 
బెల్లం అర కప్పు
జీడి పప్పు, కిసమిస్ , ఏలకుల పొడి,
పాలు - 1 టేబుల్ స్పూన్.
నెయ్యి - 1 టేబుల్ స్పూన్.
నీరు తగినంత

లడ్డుగా తయారీ విధానం
గోధుమ పిండిని మృదువుగా కలుపుకొవాలి. చిన్ని చిన్న ఉండలను చపాతీగా వత్తుకోవాలి. వీటిని ముక్కలుగా చేసుకొని బాణలిలో వేసి సన్న మంట మీద పెట్టాలి. దాంట్లో బెల్లం, జీడి పప్పు, కిస్మిస్, ఏలకుల పొడి అన్ని వేసి నెయ్యి వేసి బాగా కలుపుకొవాలి. వీటిని అడుగంటకుండా చూసుకోవాలి. పాలు కలుపుకుని లడ్డూలను తయారుచేసుకోవాలి.

Comments

Popular posts from this blog

సమ్మక్క , సారాలమ్మ జాతర ప్రారంభం సమ్మక్క , సారాలమ్మ విశేషాలు

సమ్మక్క , సారాలమ్మ జాతర ప్రారంభం సమ్మక్క , సారాలమ్మ విశేషాలు    *16 వ తేదీన సారలమ్మ , పగిడిద్దరాజు , గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.*  *17 వ తేదీన సమ్మక్క తల్లి గద్దెపై కొలువు తీరుతుంది .* *18 వ తేదీన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.*  *19 వ తేదీన దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.*  ☘సమ్మక్క మేడారం ఎలా వచ్చింది ?☘ ‘‘పుట్టు భయ్యక్క పేట పురమందు వెలసినా ఆ చందా పరుమయ్యా ఆ యింటి సమ్మక్క.’’ సమ్మక్క భయ్యక్కపేటలో పుట్టింది. ‘చందా’ అనే పేరు గల పరుమయ్య ఇంట్లో ఉండేది. ప్రస్తుతం గుడి బయ్యక్కపేటలో ఉంది. *‘బయ్యక్కపేటలో ఉండలేను. మేడారం పంపించమని’* కోరుతుంది. ‘చందా’ పరుమయ్య మేడారం గ్రామం వచ్చి (మేడారానికి బయ్యక్కపేట 10 కి.మీ దూరంలో ఉంటుంది.) అక్కడి గ్రామ తల్పతి (కులపెద్ద), వడ్డె (పూజారి), అర్థి బిడ్డతో (ఆక్షిశితులను) మాట్లాడి సమ్మక్క *‘బయ్యక్కపేటలో ఉండను’* అంది. కాబట్టి , మేడారం తీసుకెళ్తున్నానని 3 వ గోత్రికం ‘కొక్కెర’ అను ఇంటి పేరు గలవారిని , 5 వ గోత్రికం ‘సిద్ధబోయిన’ అనే ఇంటి పేరుగల వారిని వడ్డెలు ఒప్పించి మేడారంలో దించి పోతాడు. ఆనాటి నుండి ఇప్పటివరకూ వా...

NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే

NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే NTPC Recruitment 2019-20 | దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్ www.ntpccareer.net ఫాలో కావాలి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 స్కోర్ ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఎన్‌టీపీసీలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 10న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్  NTPC careers ;&nbsp ఫాలో కావాలి. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఎన్‌టీపీసీ జారీ చేసిన షార్ట్ నోటిఫికేషన్ కోసం  ఇక్కడ క్లిక్ చేయండి. NTPC Recruitment 20...

సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

*AISSEE 2022 : సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.... వివరాలు ఇలా* *దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది* *ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేషన్‌ ద్వారా ఆరోతరగతి, తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు.* *ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.* *దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 27, 2021 నుంచి ప్రారంభమవుతుంది.*  *దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 26, 2021 వరకు అవకాశం ఉంది.* *ప్రవేశ పరీక్ష (Entrance Test) జనవరి 9, 2022న నిర్వహిస్తారు.* *పరీక్ష ఫీజు ( Exam Fee) నోటిఫికేషన్‌, దరఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సందర్శించండి.* *ముఖ్య సమాచారం* *దరఖాస్తు ప్రారంభం :  సెప్టెంబర్ 27, 2021* *దరఖాస్తకు చివరి తేదీ : అక్టోబర్ 26, 2021* *సవరణలకు అవకాశం : అక్టోబర్ 28, 2021 నుంచి నవంబర్ 2, 2021* *పరీక్ష ఫీజు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.4...