తెలంగాణలో ఎంసెట్ 2020 పరీక్షకు సంబంధించి జేఎన్‌టీయూ షెడ్యూల్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు.
ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు,
మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ఆన్‌లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ద్వారా పరీక్షను నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 102 పరీక్ష కేంద్రాల్లో ఎంసెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు
తెలంగాణలో 79, ఏపీ 23 కేంద్రాలలో పరీక్షను నిర్వహించన్నారు. మొత్తం 1,43,165 అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు.
రేపటి (సెప్టెంబర్ 3) నుంచి సెప్టెంబర్ 7 వ తేదీ వరకు https://eamcet.tsche.ac.in/ వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని జేఎన్‌టీయూ కన్వీనర్ తెలిపారు.
పరీక్ష కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని.. సామాజిక దూరం పాటించాలని.. శానిటైజర్ వినియోగించాలని సూచించారు. అలాగే దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు రూ.10 వేల ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Hall ticket download cilk this link
Comments
Post a Comment