గంధపు చెక్కలు, ఏనుగు దంతాలను సైలెంట్ గా దేశాలు దాటించేవాడు. తమిళనాడు, కర్నాటక,కేరళ రాష్ట్ర ప్రభుత్వాలకు చిక్కకుండా కోట్ల రూపాయల స్మగ్లింగ్ బిజినెస్ చేస్తూ సత్య మంగళం అడవులే అడ్డాగా చక్రం తిప్పిన స్మగ్లర్ వీరప్పన్.!
అలాంటి వీరప్పన్ ను పట్టుకోడానికి కర్నాటక తమిళనాడు పోలీసులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీస్ ను ఏర్పాటు చేసి 13 సంవత్సరాల పాటు ..దాదాపు 100 కోట్ల రూపాయలను ఖర్చు చేసి …ఫైనల్ గా అక్టోబర్ 18, 2004 న అంతమొందించారు.
SP విజయ్ కుమార్ సారథ్యంలో ప్రవేశపెట్టబడిన ఆపరేషన్ కొకూన్ లో …వీరప్పన్ ను ట్రాప్ చేసి క్లోజ్ చేశారు.!?
ఆపరేషన్ కొకూన్ కథేంటి?:
ఆపరేషన్ కొకూన్ లో భాగంగా… ఓ పోలీస్ అడవికి దగ్గరగా ఉండే గూడాల్లో అంబులెన్స్ డ్రైవర్ గా ఉంటూ వీరప్పన్ కు దగ్గరయ్యాడు! వీరప్పన్ కు కంటిచూపు సమస్య రావడంతో …. చికిత్స చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేశాడు. తన అంబులెన్స్ లోనే రాత్రి సమయంలో వీరప్పన్ తో పాటు అతని అనుచరులను ఎక్కించుకొని సేలం (తమిళనాడులోని ఓ పట్టణం పేరు) వైపుగా బయలుదేరాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం ఓ స్పాట్ కు రాగానే కాల్పులు స్టార్ట్ అయ్యాయి. డ్రైవర్ వేషంలో ఉన్న పోలీస్ అంబులెన్స్ ను ఆపి తప్పించుకున్నాడు. అప్పటికే కాపు కాసి ఉన్న పోలీసులు అంబులెన్స్ పై బుల్లెట్ల వర్షం కురిపించారు. వీరప్పన్ అతడి అనుచరులు అక్కడికక్కడే చనిపోయారు.!
ఏంటా Spelling Mistake ?:
పోలీసులు తొందరలో చేసిన Mistake ఏంటంటే…తమ ప్లాన్ లో భాగంగా వాడిన అంబులెన్స్ పై Salem కు బదులుగా Selam అని రాయించారు. ఎన్నో రోజులుగా అంబులెన్స్ తమ ముందు తిరుగుతున్నప్పటికీ ఈ విషయాన్ని వీరప్పన్ కూడా గ్రహించలేదు.
రూ.100 కోట్ల ఖర్చుతో భారతదేశ చరిత్రలోకెల్లా అత్యంత ఖర్చు అయిన ఆపరేషన్ గా ఆపరేషన్ కొకూన్ నిలిచింది.
వీరప్పన్ 120 హత్యలను తానే చేసినట్టు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
2000లో కన్నడ నటుడు, కన్నడ కంఠీరవుడిగా ప్రఖ్యాతి చెందిన రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేసి విడుదల చేశాడు
అప్పట్లో వీరప్పన్ ను పట్టుకుంటే 5 కోట్లు నజరానా ప్రకటించారు.
Comments
Post a Comment