Skip to main content

Featured post

కళ్లుచెదిరే ఆఫర్‌.. కనీవినీ ఎరుగని రాయితీ...... upto 75%

వ్యవసాయ రంగానికి ఒక నవోదయం || వ్యవసాయ సంబంధి మౌలిక సదుపాయాల నిధి

 వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన నిధి లో భాగం గా ఒక లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయ సదుపాయాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి

దాదాపు గా 8.5 కోట్ల మంది రైతుల కు పిఎమ్-కిసాన్ యొక్క ఆరో కిస్తీ లో భాగం గా 17,000 కోట్ల రూపాయల ను ఆధార్ ముడిపెట్టిన బ్యాంకు ఖాతాల కు ప్రత్యక్ష ప్రయోజన మార్పిడి పద్ధతి న బదలాయించిన ప్రధాన మంత్రి



కేంద్రీయ రంగ పథకానికి మంత్రివర్గం ఆమోదం పొందిన 30 రోజుల లోపల వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన నిధి నుండి 1000 కోట్ల రూపాయల ను 2280 కి పైగా రైతు సంఘాల కు మంజూరు చేయడమైంది


రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న దార్శనికత కు అనుగుణం గా ఇప్పుడు రైతులు నవ పారిశ్రామికులు గా అయ్యేందుకు సిద్ధం గా ఉన్నారు: ప్రధాన మంత్రి


ఒక లక్ష కోట్ల రూపాయల తో కూడిన ఏగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లో భాగం గా ఆర్థిక సహాయాన్ని అందించే సదుపాయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు.  ఇది ఒక నూతన కేంద్రీయ రంగ పథకం.


ఈ పథకం సముదాయ వ్యావసాయిక ఆస్తుల ను నిర్మించడం లో మరియు పంట కోత అనంతరం చేపట్టేటటువంటి వ్యావసాయిక కార్యకలాపాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన లో రైతుల కు, పిఎసిఎస్ లకు, ఎఫ్ పిఒ లకు, వ్యవసాయ సంబంధి నవపారిశ్రామికుల కు సాయపడుతుంది. ఈ ఆస్తులు రైతులు వారి యొక్క ఉత్పత్తి కి మరింత అధిక విలువ ను రాబట్టుకొనే సమర్థత ను కలిగిస్తాయి.  అది ఎలాగంటే వారు ఈ యొక్క ఆస్తుల అండ తో వారి ఉత్పత్తి ని నిలవ చేసుకోగలిగి, వృథా ను తగ్గించుకొని, ఇంకా ప్రోసెసింగ్ పరం గా మరియు విలువ జోడింపు ద్వారా అధిక ధరల వద్ద పంటల ను విక్రయించుకొనేందుకు వెసులుబాటు ను పొందుతారు కాబట్టి. 


ఈ పథకానికి నియమం ప్రకారం మంత్రిమండలి ఆమోదం తెలిపాక, కేవలం 30 రోజుల అనంతరం, ఈ రోజున, 2,280 కి పైగా రైతు సంఘాల కు 1000 కోట్ల కు పైగా డబ్బుల ను ప్రథమంగా అనుమతించడమైంది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా నిర్వహించగా దేశం లోని వివిధ ప్రాంతాల కు చెందిన లక్షలాది రైతులు, ఎఫ్ పిఒ లు, సహకార సంఘాలు, పిఎసిఎస్ మరియు పౌరులు ఈ కార్యక్రమాని కి హాజరయ్యారు.  

 

ఇదే కార్యక్రమం లో, దాదాపు గా 8.5 కోట్ల మంది రైతుల కు పిఎమ్-కిసాన్ యొక్క ఆరో కిస్తీ లో భాగం గా 17,000 కోట్ల రూపాయల ను కూడా ప్రధాన మంత్రి విడుదల చేశారు.  ఈ నగదు ప్రయోజనాన్ని వారి యొక్క ఆధార్ సంఖ్యల ను సరిచూచిన బ్యాంకు ఖాతాల లోకి నేరు గా బదలాయించడమైంది; ఒక బటన్ ను ఒత్తినంత మాత్రాననే ఈ కార్యాన్ని సంపన్నం చేయడం జరిగింది.  ఈ మార్పిడి తో, 2018 వ సంవత్సరం లో డిసెంబర్ ఒకటో తేదీ నాడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన నాటి నుండి ఇప్పటి వరకు 10 కోట్ల మంది కి పైగా రైతుల చేతుల కు 90,000 కోట్ల రూపాయల ను అందించడమైంది. 



ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల లో సంభాషణ

ఈ పథకం ఆది నుండి లబ్ధిదారులు గా ఉన్న మధ్య ప్రదేశ్, గుజరాత్ మరియు కర్నాటక ల కు చెందిన 3  ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పిఎసిఎస్) తో ప్రధాన మంత్రి వర్చువల్ మాధ్యమం ద్వారా సంభాషించారు.  ఈ యొక్క సంఘాల ప్రతినిధుల తో వారు రుణాన్ని ఏ రకం గా వినియోగించుకోవాలని ప్రణాళిక వేస్తున్నదీ మరియు వారి వర్తమాన కార్యకలాపాలు ఏమిటనేది అర్థం చేసుకొనే ఉద్దేశం తో ప్రధాన మంత్రి ఆకర్షక చర్చ ను చేపట్టారు. గిడ్డంగుల ను నిర్మించే, గ్రేడింగ్ ఇంకా సార్టింగ్ యూనిట్ ల ను ఏర్పాటు చేసే ప్రణాళిక లు వారి వద్ద ఉన్నాయని, ఈ ప్రణాళిక లు ఆచరణ లోకి వస్తే తద్ద్వారా సంఘ సభ్యత్వం కల రైతులు వారి యొక్క ఉత్పత్తుల కు అధిక ధర ను సంపాదించుకోవడం లో సహాయకారి అవుతాయని సంఘాలు ప్రధాన మంత్రి కి తెలియజేశాయి.  



దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రసంగం


ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల తో ముఖాముఖి అనంతరం, ప్రధాన మంత్రి దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, రైతులు మరియు వ్యవసాయ రంగం ఈ యొక్క పథకం ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని పొందగలరో అనే విషయం పట్ల తనకు గల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  ఈ పథకం రైతుల కు మరియు వ్యవసాయ రంగానికి ఆర్థికపరమైనటువంటి  ఉత్తేజాన్ని సమకూర్చగలదని, అలాగే ప్రపంచ వేదిక పైన పోటీ కి నిలచేందుకు భారతదేశం యొక్క సామర్థ్యాన్ని పెంపు చేస్తుందని ఆయన అన్నారు. 


గోదాముల నిర్మాణం, చలవ వసతులు, ఇంకా ఫూడ్ ప్రోసెసింగ్ ల వంటి పంటకోతల అనంతర వ్యవసాయ ఉత్పత్తి నిర్వహణ సంబంధి సాధనాల లో పెట్టుబడి పెట్టడం కోసం మరియు సేంద్రియ ఆహార పదార్థాలు, ఇంకా దృఢీకరించిన ఆహార పదార్థాల వంటి రంగాల లో ప్రపంచ స్థాయి ఉపస్థితి ని ఆవిష్కరించుకోవడం కోసం భారతదేశం లో ఒక భారీ అవకాశం ఉన్నదని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.  ఈ పథకం వ్యవసాయ రంగం లో స్టార్ట్ అప్ స్ కు ప్రయోజనాల ను అందుకొనేందుకు వాటి యొక్క కార్యకలాపాల ను విస్తరించుకొనేందుకు ఒక మంచి అవకాశాన్ని ప్రసాదిస్తుందని, తద్ద్వారా దేశం లోని ప్రతి ఒక్క మూల లోని రైతుల ను చేరగలిగే ఒక ఇకోసిస్టమ్ వెలసే ఆస్కారం ఉందని కూడా ఆయన అన్నారు. 


పిఎమ్-కిసాన్ పథకం అమలు యొక్క వేగం పట్ల ప్రధాన మంత్రి తన సంతృప్తి ని వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమం యొక్క కొలత ఎంత పెద్దదీ అంటే ఈ రోజు న విడుదల అయిన నిధులు అనేక దేశాల యావత్తు జనాభా అంతటి ని ఒక చోటు లో చేర్చినపుడు ఏర్పడే దాని కంటే కూడా అధిక సంఖ్య లో గల ప్రజల కు ఈ యొక్క నిధులు చేరుకొన్నాయి అని కూడా ఆయన అన్నారు.  నమోదు మొదలుకొని పంపకాల వరకు గల యావత్తు ప్రక్రియ ద్వారా రైతుల కు సాయపడడం లో మరియు పథకం యొక్క అమలు లో ఒక ముఖ్య పాత్ర ను పోషిస్తున్నందుకు గాను రాష్ట్రాల ను కూడా ఆయన అభినందించారు.


వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింహ్ తోమర్ కూడా ఈ సందర్భం లో హాజరయ్యారు.



వ్యవసాయ సంబంధి మౌలిక సదుపాయాల నిధి


పంటకోత ల అనంతర నిర్వహణ సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన కు మరియు సముదాయ వ్యావసాయిక ఆస్తుల కల్పన కు ఉద్దేశించిన ఆచరణీయ పరియోజనల లో పెట్టుబడి పెట్టేందుకు దీర్ఘకాలికమైన ఆర్థిక సహాయ పెట్టుబడి సౌకర్యాన్ని అందించే ఒక మాధ్యమం వ్యవసాయ సంబంధి మౌలిక సదుపాయాల నిధి.  దీనిలో పరపతి పూచీ, ఇంకా వడ్డీ లో ప్రభుత్వ ఆర్థిక సహాయం కలసి ఉంటాయి.  ఈ పథకం యొక్క కాలపరిమితి 2020 వ ఆర్థిక సంవత్సరం నుండి 2029 వ ఆర్థిక సంవత్సరం వరకు (అంటే 10 సంవత్సరాల పాటు) ఉంటుంది.  ఈ పథకం లో భాగం గా, బ్యాంకు లు మరియు ఆర్థిక సహాయ సంస్థ లు ఒక లక్ష కోట్ల రూపాయల ను రుణాలు గా సమకూర్చుతాయి. ఈ రుణాల కు ప్రతి ఒక్క సంవత్సరాని కి 3 శాతం ఇంటరెస్ట్ సబ్ వెన్శన్ మరియు 2 కోట్ల రూపాయల వరకు ఉండే రుణాల కు సిజిటిఎమ్ఎస్ఇ పథకం లో భాగం గా పరపతి పూచీ లభిస్తుంది.  లబ్ధిదారుల లో రైతు లు, వ్యవసాయ సంబంధి నవ పారిశ్రామికుల తో పాటు, పిఎసిఎస్ లు, మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ లు, ఎఫ్ పిఒ లు, ఎస్ హెచ్ జి లు, జాయింట్ లయబిలిటి గ్రూప్స్ (జెఎల్ జి), బహుళ ప్రయోజనాత్మక సహకార సంఘాలు, , స్టార్ట్ అప్ స్, ఇంకా సెంట్రల్/ స్టేట్ ఏజెన్సి లేదా స్థానిక సంస్థ ప్రాయోజితం చేసిన పబ్లిక్-ప్రైవేట్ పార్ట్ నర్ శిప్ ప్రాజెక్టు లు కూడా ఉంటాయి.



పిఎమ్-కిసాన్


ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పిఎమ్-కిసాన్) పథకాన్ని 2018వ సంవత్సరం లో డిసెంబర్ ఒకటో తేదీ నాడు ప్రవేశపెట్టడమైంది.  కమతాల ను కలిగివున్న రైతు లు అందరి కి (కొన్ని మినహాయింపు ప్రమాణాల కు లోబడి) వారు వారి యొక్క వ్యావసాయిక అవసరాల ను తీర్చుకోగలిగి మరి వారి యొక్క కుటుంబాల కు దన్ను గా నిలచే వీలు ను కల్పించడం కోసం నగదు ప్రయోజనం రూపేణా ఆదాయ పరమైనటువంటి మద్దతు ను సమకూర్చడానికి ఈ పథకాన్ని లక్షించారు.  ఈ పథకం లో భాగం గా, అర్హులైన లబ్ధిదారు రైతుల కు ప్రతి ఒక్క సంవత్సరం లో 6000 రూపాయల వంతున ఆర్థిక సహాయ ప్రయోజనాన్ని మూడు సమాన కిస్తీల లో అందించడం జరుగుతున్నది. 



వ్యవసాయ రంగానికి ఒక నవోదయం


ఈ చర్య లు ప్రధాన మంత్రి మార్గదర్శకత్వం లో భారత ప్రభుత్వం తీసుకొన్న సంస్కరణ ల యొక్క క్రమం లో తాజా వి.  ఈ చర్య లు భారతదేశం లో వ్యవసాయ రంగానికి ఒక నూతనమైన 

తొలిసంజ ను ప్రకటించగలవు.  ఈ చర్య లు భారతదేశం లో రైతుల సతత జీవనోపాధి కి మరియు రైతు ల సంక్షేమానికి పూచీ పడాలన్న ఆశయ సాధన పట్ల ప్రభుత్వం యొక్క నిబద్ధత ను నిరూపిస్తున్నాయి.



Comments

Popular posts from this blog

సమ్మక్క , సారాలమ్మ జాతర ప్రారంభం సమ్మక్క , సారాలమ్మ విశేషాలు

సమ్మక్క , సారాలమ్మ జాతర ప్రారంభం సమ్మక్క , సారాలమ్మ విశేషాలు    *16 వ తేదీన సారలమ్మ , పగిడిద్దరాజు , గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.*  *17 వ తేదీన సమ్మక్క తల్లి గద్దెపై కొలువు తీరుతుంది .* *18 వ తేదీన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.*  *19 వ తేదీన దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.*  ☘సమ్మక్క మేడారం ఎలా వచ్చింది ?☘ ‘‘పుట్టు భయ్యక్క పేట పురమందు వెలసినా ఆ చందా పరుమయ్యా ఆ యింటి సమ్మక్క.’’ సమ్మక్క భయ్యక్కపేటలో పుట్టింది. ‘చందా’ అనే పేరు గల పరుమయ్య ఇంట్లో ఉండేది. ప్రస్తుతం గుడి బయ్యక్కపేటలో ఉంది. *‘బయ్యక్కపేటలో ఉండలేను. మేడారం పంపించమని’* కోరుతుంది. ‘చందా’ పరుమయ్య మేడారం గ్రామం వచ్చి (మేడారానికి బయ్యక్కపేట 10 కి.మీ దూరంలో ఉంటుంది.) అక్కడి గ్రామ తల్పతి (కులపెద్ద), వడ్డె (పూజారి), అర్థి బిడ్డతో (ఆక్షిశితులను) మాట్లాడి సమ్మక్క *‘బయ్యక్కపేటలో ఉండను’* అంది. కాబట్టి , మేడారం తీసుకెళ్తున్నానని 3 వ గోత్రికం ‘కొక్కెర’ అను ఇంటి పేరు గలవారిని , 5 వ గోత్రికం ‘సిద్ధబోయిన’ అనే ఇంటి పేరుగల వారిని వడ్డెలు ఒప్పించి మేడారంలో దించి పోతాడు. ఆనాటి నుండి ఇప్పటివరకూ వా...

NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే

NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే NTPC Recruitment 2019-20 | దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్ www.ntpccareer.net ఫాలో కావాలి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 స్కోర్ ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఎన్‌టీపీసీలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 10న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్  NTPC careers ;&nbsp ఫాలో కావాలి. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఎన్‌టీపీసీ జారీ చేసిన షార్ట్ నోటిఫికేషన్ కోసం  ఇక్కడ క్లిక్ చేయండి. NTPC Recruitment 20...

సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

*AISSEE 2022 : సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.... వివరాలు ఇలా* *దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది* *ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేషన్‌ ద్వారా ఆరోతరగతి, తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు.* *ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.* *దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 27, 2021 నుంచి ప్రారంభమవుతుంది.*  *దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 26, 2021 వరకు అవకాశం ఉంది.* *ప్రవేశ పరీక్ష (Entrance Test) జనవరి 9, 2022న నిర్వహిస్తారు.* *పరీక్ష ఫీజు ( Exam Fee) నోటిఫికేషన్‌, దరఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సందర్శించండి.* *ముఖ్య సమాచారం* *దరఖాస్తు ప్రారంభం :  సెప్టెంబర్ 27, 2021* *దరఖాస్తకు చివరి తేదీ : అక్టోబర్ 26, 2021* *సవరణలకు అవకాశం : అక్టోబర్ 28, 2021 నుంచి నవంబర్ 2, 2021* *పరీక్ష ఫీజు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.4...