బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 746 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 747 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (మార్చి 6) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో 'swamyway’లో మీకోసం ముందుగానే.

ఆదిత్య నవ్వుతూ, వింటూ ఉంటాడు. ‘డాక్టర్ బాబుని ఎలాగైనా ఒప్పించాలి బాబు. నేనే.. విసిగించి, వేదించి ఒప్పింద్దాం అనుకున్నాను..’ అంటాడు మురళీ కృష్ణ. ‘అనుకోవడమేంటీ? అదే చెయ్యండి.. అదే జరిగితే వదినా, సౌర్య ఎంత ఆనందపడతారో.. వాళ్లకంటే హిమ ఎక్కువగా ఆనందిస్తుంది.. ముందు మీరు హిమతో ఈ విషయం చెబితే అదే అన్నయ్యని ఒప్పిస్తుంది..’ అంటాడు ఆదిత్య హ్యాపీగా..
గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే...
తన తల్లి దీప.. కనిపించడం లేదని సౌర్య కార్తీక్ ఇంటికి వస్తుంది. ‘అమ్మ కనిపించట్లేదు నాన్నమ్మా... మా అమ్మని ఎవరో బాధపెట్టారు.. ఎక్కడికి వెళ్లిందో తెలియదు.. ఇంట్లో సమాన్లు అన్నీ పిచ్చి పిచ్చిగా పడి ఉన్నాయి.. ఎవ్వరూ తెలియదన్నారు. అమ్మ లేదు. ఏం అయ్యిందో తెలియడట్లేదు. నాకు భయంగా ఉంది’ అంటూ సౌర్య బాగా ఏడుస్తుంది. దాంతో అందరూ వెతికే పనిలో పడతారు.
కారులో వెళ్తూ..
ఆదిత్య, మురళీ కృష్ణలు కారులో శ్రావ్యకి టాబ్లెట్స్ తేవడానికి వెళ్తూ ఉంటారు. ‘నిజంగా మీరంతా చాలా మంచివాళ్లు బాబు. శ్రావ్యకి టాబ్లెట్స్ దొరక్కపోతే.. ఇంత దూరం వచ్చి మరీ టాబ్లెట్స్ తీసుకుంటున్నారు మీరు. అయినా ఇంత గొప్పింటి బిడ్డలు నాకు కూతుర్లకు భర్తలుగా రావడం చాలా సంతోషం బాబు. ఇక ఎలాగైనా మనం డాక్టర్ బాబు, దీపలని కూడా కలిపెయ్యాలి బాబు’ అంటూ ఉంటాడు మురళీ కృష్ణ.
హిమకి చెప్పండి చాలు!

ఆదిత్య నవ్వుతూ, వింటూ ఉంటాడు. ‘డాక్టర్ బాబుని ఎలాగైనా ఒప్పించాలి బాబు. నేనే.. విసిగించి, వేదించి ఒప్పింద్దాం అనుకున్నాను..’ అంటాడు మురళీ కృష్ణ. ‘అనుకోవడమేంటీ? అదే చెయ్యండి.. అదే జరిగితే వదినా, సౌర్య ఎంత ఆనందపడతారో.. వాళ్లకంటే హిమ ఎక్కువగా ఆనందిస్తుంది.. ముందు మీరు హిమతో ఈ విషయం చెబితే అదే అన్నయ్యని ఒప్పిస్తుంది..’ అంటాడు ఆదిత్య హ్యాపీగా..
వెనకడుగు వేసిన కార్తీక్.
కార్తీక్ కారు పోలీస్ వ్యాన్‌కి ఎదురు రావడంతో.. పోలీస్ ఇన్‌స్పెక్టర్.. కిందకు దిగి.. ‘ఎవడ్రా వాడు?’ అంటాడు. ఇంతలో కార్తీక్ దిగి రావడం చూసి.. ‘డాక్టర్ గారు మీరా?’ అంటాడు పోలీస్. ‘ఏంటండీ ఈ టైమ్‌లో?’ అంటాడు పోలీస్.. ‘అది లేట్ అయ్యింది..’ అంటాడు కార్తీక్. వెంటనే పోలీస్ కూల్‌గా ‘ఓకే సార్ వెళ్లండి’ అనగానే బయలుదేరిన కార్తీక్ ఆగి.. దీప గురించి చెబుదాం అనుకుంటాడు. అయితే.. ‘ఆమె నీకు ఏం అవుతుందని అడుగుతాడేమో..’ అని భయపడి వెనుతిరుగుతాడు.
దీప కోసమే అందరి టెన్షన్..
మళ్లీ ఆగి.. జేబులోంచి ఫోన్ తీసి.. దీప ఫోటో చూపిస్తూ..‘సార్ ఈ అమ్మా మా బంధువుల ఆమె.. కనిపించట్లేదు. వెతికించగలరా?’ అంటాడు కార్తీక్. వెంటనే పోలీస్ ‘తప్పకుండా సార్’ అనడంతో.. పోలీస్ నంబర్ తీసుకుని దానికి దీప ఫోటో పంపిస్తాడు. ఇక సౌందర్య, ఆనందరావు, సౌర్యలు ఓ వైపు.. కార్తీక్, హిమలు మరోవైపు వెతుకుతుంటే.. మురళీ కృష్ణ.. ఆదిత్యలు కూడా వేరు వేరుగా దీపని వెతుకుతూ ఉంటారు.
ప్రియమణి ఇచ్చిన ఇన్ఫర్మేషన్
మౌనిత కూల్‌గా యోగాశనం వేసి యోగా చేస్తూ ఉంటుంది. ఇంతలో ప్రియమణి వచ్చి.. ‘ఇంకేదో కొత్త కథ స్టార్ట్ అయ్యినట్లుందమ్మా’ అనడంతో మౌనిత కళ్లు తెరిచి ‘ఏం అయ్యిందే?’ అంటుంది. m..i..s..s..i..n..g అంటే ఏంటమ్మా?’ అంటుంది అక్షరాలు పలుకుతూ.. ‘మిస్సింగ్’ అంటుంది మౌనిత అర్థం కానట్లుగా.. ‘హా అదేనమ్మా.. దీప మిస్సింగ్ అంటమ్మా.. కార్తీక్ అయ్య మీ ఫోన్‌కి మెసేజ్ పెట్టారు.. పైకి కనిపిస్తుంటే చూశాను’ అంటుంది ప్రియమణి.
మౌనిత ఆనందం..
వెంటనే మౌనిత ‘నిజమా’ అంటూ ఫోన్ చెక్ చేసుకుంటుంది. నిజమే అంటూ నవ్వాలో బాధగా పెట్టాలో అన్నట్లుగా చూస్తూ.. ‘దీప మిస్సింగా? దీప మాయమైపోయిందా? కార్తీక్ జీవితంలోంచి దీప వెళ్లిపోయింది. ఈ మౌనితకి అడ్డుగా ఉన్న దీప వెళ్లిపోయిందా? దీప.. లేదా? దీప.. రాదా? దీప.. దొరకదా? యాహూ’ అంటూ రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌లో ఆనందపడిపోతుంది మౌనిత. అది చూసి ప్రియమణి కూడా నవ్వుతుంది.
మీరేంటమ్మా దీపకి సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు?
‘పెళ్లి కాని నాకే.. కార్తీక్ ప్రియురాలి ఫోటోని చూసి ఎంతగానో మండింది. మరి కట్టుకున్న భార్యకు ఆ మాత్రం బాధ ఉండదా ఏంటీ? తప్పు లేదు. అయినా పాపం ఎన్నేళ్లని భరిస్తుంది? ఎంత కాలమని సహిస్తుంది..?’ అంటూ డైలాగ్స్ చెబుతుంది మౌనిత దీప మీద సానుభూతిగా... వెంటనే ప్రియమణి.. ‘మీరేంటమ్మా దీప దరపున మాట్లాడతున్నారు?’ అని అడుగుతుంది. వెంటనే మౌనిత ప్రియమణిని ఒకటి పీకబోయి.. ఆగుతుంది.
మౌనిత కుట్ర..
మౌనిత మనసులో.. ‘దీపని కార్తీక్ వాళ్లకంటే ముందే పట్టుకుని.. డైరెక్ట్‌గా పైకి పంపించేస్తే.. అప్పుడు ఇక శాశ్వతం దీప టెన్షన్ ఉండదు.’ అనుకుంటుంది. వెంటనే ఫోన్ తీసి.. ‘నాకు తెలిసి పోలీస్‌కి కాల్ చేసి దీపని వెతకమని చెబుతాను..’ అని మనసులో అనుకుంటుంటే.. ప్రియమణి మాత్రం మౌనిత వైపు అనుమానంగా చూస్తుంది. ‘ఏంటమ్మా ఆలోచిస్తున్నారు’ అని ప్రియమణి అనగానే.. ‘నువ్వు పో.. పోయి పని చూసుకో’ అంటూ ప్రియమణిని లోపలికి పంపేస్తుంది మౌనిత. వెంటనే తనకు తెలిసి ఫోలీస్‌కి కాల్ చేస్తుంది.
ఆనందరావు, సౌందర్యాల ఆవేదన..
సౌందర్య సడన్‌గా కారు పక్కకు ఆపేస్తుంది. ‘ఏమైంది సౌందర్య?’ అంటాడు ఆనందరావు. ‘చేతులు వణుకుతున్నాయండీ’ అంటుంది బాధగా.. ‘పోని నేను డ్రైవ్ చెయ్యనా?’ అంటాడు ఆనందరావు కూడా అంతే బాధగా.. వెంటనే సౌందర్య.. ‘మీ కళ్లలో తడి ఉందండీ.. రోడ్డు కనపడదు..’ అంటుంది. వెనకే కూర్చున్న సౌర్య.. ‘నాన్నమ్మా అక్కడో గుడి ఉంది అక్కడ చూద్దామా?’ అని అనడంతో సౌందర్య కారు అటు పోనిస్తుంది.
మురళీ కృష్ణ ఫైర్..
దీపని వెతుకుతూ.. కార్తీక్, మురళీ కృష్ణలు ఎదురెదురు పడుతారు. అయితే కార్తీక్‌ని చూడగానే మురళీ కృష్ణ ఆవేశంగా.. ‘ఎటో వెళ్తున్నట్లున్నారు..? నా కూతురు శవాన్ని వెతకడానికా? ఏ నోతిలో వెతుకుతున్నారు? ఏ చెరువులో వెతుకుతున్నారు? లేక ఏ రైలు పట్టాలు వెతుకుతున్నారు? అసలు మీరు వెతుకుతూ వెలుతోంది దీపనా లేక పోగొట్టుకున్న మీ ఆదర్శాన్నా? ఏం దొరుకుతుందని చీకట్లో వెతుకుతున్నారు డాక్టర్ బాబు.? వెలుతురిలో పోగొట్టుకున్నది చీకట్లో ఎలా దొరుకుతుంది?’ అంటూ అరుస్తాడు. కార్తీక్ మౌనంగా నిలబడి వింటాడు.
తిరిగి మాట్లాడలేని కార్తీక్..
‘నేనేదో మోసం చేశాను.. ద్రోహం చేశాను అన్నట్లుగా మాట్లాడతారు.. నేనేం తప్పు చేశాను.. ఒక్క నిజం దాచి పెళ్లి చేశాను.. మీరు నా కూతుర్నే ధగా చేశారు కదా? అయినా అయినా అదేదో దేశాన్ని ఉద్దరించినట్లు, నీలాంటి కారణజన్ములు ఇంతకు ముందు పెట్టనట్టు.. ఇక మీదట పుట్టరన్నట్టు.. మమ్మల్ని పురుగుల్లా తీసి పారేశారు కదయ్యా.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?’ అంటూ మురళీ కృష్ణ కన్నీళ్లతో కార్తీక్‌ని ప్రశ్నిస్తుంటే.. కార్తీక్ మాత్రం మౌనంగా వింటాడు. ఆ సీన్‌లో మురళీ కృష్ణ మాటలు కంటతడి పెట్టిస్తాయి.
పూర్తి బాధ్యత మీదే..
‘ఏమండీ డాక్టర్ గారు? దాని మానాన్న.. అది(దీప) ఏదో స్కూల్లో నాలుగు చాక్లెట్లు పంచిపెట్టి.. పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటే.. మీరు స్కూల్‌కి వచ్చి.. ఫంక్షన్‌కి పిలిచి, మనసు విరిగేలా చేసి అది ఎక్కడికో వెళ్లిపోయేలా చెయ్యడం అవసరమా? ఇంత శాడిస్ట్‌లా ఎందుకు మారిపోయారు? ఇదిగో ఇప్పుడు చెబుతున్నాను.. అది మీ ఇంటికి వచ్చిన తర్వాతే వెళ్లిపోయింది. దానికి ఏదైనా అయితే.. పూర్తి బాధ్యత మీదే..’ అంటూ అరిచి ఏడుస్తూ అక్కడ నుంచి బయలుదేరతాడు మురళీ కృష్ణ.
ఏమయ్యా పెద్దమనిషి..
అప్పటి దాకా మౌనంగా ఉన్న కార్తీక్.. వెళ్లిపోతున్న మురళీ కృష్ణకి చిటికలు వేసి పిలుస్తాడు. ‘ఏమయ్యా పెద్దమనిషి.. ఒక్క నిమిషం ఆగు’ అంటాడు కార్తీక్. మురళీ కృష్ణ అదే ఆవేశంలో.. ‘హా.. ఏంటి..? ఏం అందామని? ఏం తిడదామని?’ అంటాడు. ‘ఇంటికి వెళ్లి బీపీ టాబ్లెట్స్ వేసుకుని పడుకో.. నీకు ఏదైనా అయితే అది కూడా నా మెడకే చుడతారు నీలాంటి వాళ్లు..’ అంటాడు కార్తీక్ కూల్‌గా.. ‘నేను అన్నదాంట్లో అబద్దం ఉందా?’ అంటాడు మురళీ కృష్ణ.
మురళీ కృష్ణ మౌనం..
‘నిజం లేదు..’ అంటూనే ‘ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు?’ అని అడుగుతాడు కార్తీక్ అంతే కూల్‌గా.. ‘ఇంకెక్కడి నుంచి వస్తాం? ఇంటి నుంచే..’ అంటాడు మురళీ కృష్ణ. ‘మీ ఇంటి నుంచా? దీప ఇంటి నుంచా?’ అని అడుగుతాడు కార్తీక్. ‘మా ఇంటి నుంచే.. ఎందుకు?’ అంటాడు మురళీ కృష్ణ. ‘మీ కూతురు ఏం చంటిది కాదు. కానీ చంటి దాన్ని మా ఇంట్లో వదిలేసి వెళ్లిందే.. దాని బుర్రలో మట్టి ఉందా? మీ తలలో బురదుందా?’ అంటూ ఫైర్ అవుతాడు కార్తీక్. మురళీ కృష్ణ మౌనంగా చూస్తుంటాడు.
కార్తీక్ ఆవేశం..
‘ఆ చంటిదాని గురించి ఆలోచించాల్సిన పనిలేదా దానికి(దీపకి)? మాట్లాడితే డాక్టర్ బాబు వంటలక్కకి అన్యాయం చేశాడు అంటారు.. ఇప్పుడు నీ కూతురికి ఏం తక్కువైంది? ఇప్పుడు అది నీ మనవరాల్ని(సౌర్యని) వదిలేసి పారియోయింది.. ఎంతిస్తే మీరు మీ మనవరాల్ని పట్టించుకుంటారో చెప్పండి. దాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. వెళ్లవయ్యా వెళ్లు. నీ కింద ఇన్ని తప్పులు పెట్టుకుని.. అనడానికి వచ్చేస్తున్నారు..’ అంటూ అక్కడ నుంచి ఆవేశంగా వెళ్లిపోతాడు కార్తీక్.
పాపం సౌర్య..
అంతా ఇంటికి చేరుకుంటారు. వారణాసి, సౌందర్య, ఆనందరావు, ఆ వెనుకే కార్తీక్, హిమ అంతా ఇంటికి చేరుకుంటారు. ఎవరికీ దీప దొరకదు. అయితే ‘ఉదయాన్నే వెతుకుదాం.. నువ్వు వెళ్లి పడుకో రౌడీ’ అంటాడు కార్తీక్. అదే మాట వారణాసి కూడా అంటాడు. అయితే సౌర్య ఏడుస్తూ.. ‘కనిపించకుండా పోయింది మా అమ్మ కదా.. తిరిగి వస్తుందో లేదో తెలియకపోతే నిద్ర ఎలా పడుతుంది?’ అంటుంది. అయితే కార్తీక్ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినా సౌర్య వినకపోయే సరికి కోపంతో వెళ్లు లోపలికి అని అరుస్తాడు. దాంతో ఆవేశంగా సౌర్య లోపలికి వెళ్లిపోతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! కార్తీకదీపం కొనసాగుతోంది
Comments
Post a Comment