Railway Jobs: తెలంగాణ, ఏపీలో 4103 రైల్వే ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే South Central Railway Recruitment 2019
తెలంగాణ, ఏపీలో 4103 రైల్వే ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే SouthCentral Railway Recruitment 2019
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. సికింద్రాబాద్ జోన్ పరిధిలో మొత్తం 4103 రైల్వే అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
1. రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 4103 ఖాళీలను ప్రకటించింది.
2. ఏసీ మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది.
3. మొత్తం 4103 ఉద్యోగాల్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉండటం విశేషం. నోటిఫికేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్ scr.indianrailways.gov.in ఓపెన్ చేసి చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 8 చివరి తేదీ.
4. South Central Railway Apprentice Vacancy Details
Total Posts – 4103
AC Mechanic - 249
Carpenter - 16
Diesel Mechanic - 640
Electrical/Electronics - 18
Electrician - 871
Electronic Mechanic - 102
Fitter - 1460
Mechanist - 74
MMW - 34
MMTM - 12
Painter - 40
Welder - 597
5. ఈ పోస్టులకు 2019 నవంబర్ 9న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభమైంది. 2019 డిసెంబర్ 8 రాత్రి 11.30 గంటల్లోగా దరఖాస్తు చేయాలి.
6. అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 50% మార్కులతో 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. దరఖాస్తు ఫీజు రూ.100. (Source: South Central Railway notification)
7. అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు.
8. ఈ అప్రెంటీస్ పోస్టుల్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 27 యూనిట్లలో భర్తీ చేయనుంది. ఇందులో 25 యూనిట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి.
9. లాలాగూడ, మెట్టుగూడ, కాజిపేట్, సికింద్రాబాద్, మౌలాలి, కాచిగూడ, గుంటుపల్లి, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, గుంతకల్, గుత్తి, తిరుపతి, నాందేడ్, పూర్ణ ప్రాంతాల్లో ఈ యూనిట్లు ఉన్నాయి. (Source: South Central Railway notification)
Application link. :: http://gestyy.com/w5Z4lh
Comments
Post a Comment