Skip to main content

Featured post

కళ్లుచెదిరే ఆఫర్‌.. కనీవినీ ఎరుగని రాయితీ...... upto 75%

తెలంగాణ ఆర్‌టీసీ సమ్మె: కేసీఆర్ చెప్పిన మాటల్లో నిజమెంత? నష్టాలు, జీతాలపై సీఎం లెక్కల్లో వాస్తవాలేమిటి?

ఆర్టీసీ సమ్మెపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఆర్టీసీ మూత పడడం మినహా గత్యంతరం లేదని స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అయితే ఆర్టీసీని తమకు అప్పగిస్తే లాభాలు తెప్పిస్తామని కొందరు యూనియన్ నాయకులు వ్యాఖ్యలు చేశారు.

హుజూర్ నగర్ శాసనసభ ఉప ఎన్నికలో విజయం సాధించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ఆర్టీసీపై అనేక వ్యాఖ్యలు చేసారు. చాలా సమాచారం ఇచ్చారు. చాలా లెక్కలు చెప్పారు. ఇంతకీ వాటిలో వాస్తవాలెన్ని? కేసీఆర్ చెప్పిన అంకెల్లో నిజాలెంత?

కేసీఆర్: ముందు 44 శాతం, తరువాత 14 శాతం.. మొత్తం 67 శాతం జీతాలు పెంచాం. దేశ చరిత్రలో నాలుగేళ్లలో 67 శాతం జీతాలు పెంచిన చరిత్ర ఉందా?

వాస్తవం: 2015లో 44 శాతం, 2018లో 16 శాతం ఐఆర్ (ఇంటీరిమ్ రిలీఫ్ - మధ్యంతర భృతి) ఇచ్చారు. ఇవి రెండూ కలిపితే 60 శాతం పెరిగింది.


కేసీఆర్: దేశంలో ఇప్పుడు ఆర్టీసీ నామమాత్రంగానే ఉంది. అన్ని రాష్ట్రాలూ తీసేశాయి. మధ్యప్రదేశ్‌లో స్వయంగా దిగ్విజయ్‌సింగ్ ఆర్టీసీని మూసేశారు. బెంగాల్లో సీపీఎం హాయాంలోనే ఆర్టీసీ నిర్వీర్యం అయింది. పది కోట్ల జనాభాకు 200 బస్సులున్నాయి అక్కడ. ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఇంకా నాలుగైదు రాష్ట్రాల్లో ఆర్టీసీ లేనే లేదు. బిహార్లో కేవలం వందల సంఖ్యలోనే బస్సులు ఉన్నాయి.

వాస్తవం: ఆర్టీసీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితుల్లో ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు వంటి చోట్ల బలంగానూ.. బెంగాల్, బిహార్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల వంటి చోట్ల బలహీనంగా ఉంది. అయితే పశ్చిమ బెంగాల్ ఆర్టీసీకి కేసీఆర్ చెప్పినట్టుగా 200 బస్సులు కాదు.. మొత్తం 1,337 బస్సులు ఉన్నాయి. కోల్‌కతాలో ఉన్న ట్రామ్వేలు, ఇతర కార్పొరేషన్లవి కలిపితే ఈ సంఖ్య వచ్చింది. ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లలో ఆర్టీసీ లేదు.

కేసీఆర్: ఆర్టీసీకి 5,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఒక నెల వాయిదా కట్టకపోతే ఎన్‌పీఏ అవుతుంది ఆర్టీసీ.

వాస్తవం: ఆర్టీసీకి 2018-19 సంవత్సరం ముగిసే నాటికి రూ. 3234.74 కోట్ల అప్పు ఉంది. ఇక ఈ ఏడాది ఆగస్టు నాటికి మొత్తం అప్పు రూ. 3049.26 కోట్లు.

కేసీఆర్: ఆర్టీసీ పీఎఫ్ సొమ్ము ప్రభుత్వం తీసుకోలేదు. ఆర్టీసీలో రిటైర్ అయిన వారికి ప్యాకేజీ ఇచ్చే పరిస్థితి లేదు.

వాస్తవం: పీఎఫ్ సొమ్ము ప్రభుత్వం తీసుకోలేదు. కానీ ఆర్టీసీ యాజమాన్యం వాడుకుంది. 2018 ఫిబవ్రరి నుంచి 2019 ఆగస్టు వరకూ రూ. 315.34 కోట్లు పీఎఫ్ సొమ్ము ఉద్యోగస్తుల నుంచి కట్ చేశారు కానీ, డిపాజిట్ చేయలేదు. ఇక సంస్థ చెల్లించాల్సిన రూ. 445.28 కోట్ల పీఎఫ్ కూడా చెల్లించలేదు.

కేసీఆర్: ఆర్టీసీకి ఏడాదికి 1,200 కోట్ల రూపాయల నష్టం వస్తోంది. అంటే నెలకు వంద కోట్ల నష్టం వస్తోంది. ప్రైవేటు వారికి లాభాలు వస్తున్నప్పుడు ఆర్టీసీకి ఎందకు రావు?

వాస్తవం: ఒక్క 2015-16లోనే 1,145.39 కోట్లు నష్టం వచ్చింది. తరువాత ఎప్పడూ అంత భారీగా నష్టం రాలేదు. 2016-17లో రూ. 749 కోట్లు, 2017-18లో రూ. 748 కోట్లు, 2018-19లో రూ. 928 కోట్లు నష్టం వచ్చింది.

కేసీఆర్: ఆర్టీసీలో ప్రైవేటు బస్సుల మీద ఒక కిలోమీటరుకు 75 పైసలు లాభం వస్తోంది. సగటున 300 కిలోమీటర్లు తిరుగుతాయి అనుకుంటే.. రోజుకు 225 రూపాయలు, నెలకు మొత్తం అద్దె బస్సుల మీద రూ. 4,72,000 లాభం వస్తోంది. ఇక ఆర్టీసీ బస్సుల వల్ల కిలోమీటరుకు 13 రూపాయల నష్టం వస్తోంది. మొత్తం బస్సుల మీద నెలకు రూ. 3 కోట్ల రూపాయల నష్టం వస్తోంది.

వాస్తవం: ఈ విషయంలో పూర్తి స్థాయి గణాంకాలు అందుబాటులో లేవు. కానీ ప్రైవేటు బస్సుల వల్ల రూ. 149 కోట్లు నష్టం వచ్చిందనీ.. ఆర్టీసీ బస్సుల వల్ల కేసీఆర్ చెప్పినట్టుగా కిలోమీటరుకు 13 రూపాయలు కాకుండా.. 5.60 రూపాయలు నష్టం వస్తోందనీ యూనియన్లు చెబుతున్నాయి. అయితే ప్రైవేటు, ఆర్టీసీ కలిపితే మాత్రం ఒక కిమీ బస్సు నడిపితే రూ. 7.10 రూపాయల సగటు నష్టం వస్తోందని వివరిస్తున్నాయి.

కేసీఆర్: ఆర్టీసీ సిబ్బందికి సగటు జీతం రూ. 50,000 వస్తోంది. బయట రూ. 5,000 రాని వారు కూడా ఉన్నారు. అన్నమో రామచంద్రా అనే వారు ఉన్నారు.

వాస్తవం: ఈ విషయంలో రెండు కోణాలు ఉన్నాయి. అధికారులకూ, కార్మికులకూ మధ్య జీతాల వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో ఆర్టీసీ ఈడీలు, లేదా ఆ స్థాయి సీనియారిటీ ఉన్నవారు నెలకు సుమారు రూ. 3,00,000 జీతం తీసుకుంటున్నారు. ఇక రూ. 18,000 వేలు జీతం ఉన్న వారూ ఉన్నారు. అధికారుల జీతాలకీ, కార్మికుల జీతాలకూ మధ్య వ్యత్యాసం చాలా ఎక్కు ఉంది.

గతంలో ఎక్కువ మంది డ్రైవర్లు కండక్టర్లు మీడియాకు చూపించిన పే స్లిప్పులు రూ. 25,000 నుంచి రూ. 30,000 మధ్య సగటు జీతాన్ని సూచిస్తున్నాయి.

పోనీ కార్మికులు, అధికారుల మధ్య ఉన్న తేడాల సంగతి పక్కన పెట్టి మొత్తం ఆర్టీసీ చెల్లించే జీతాలను, మొత్తం సంస్థ ఉద్యోగుల సంఖ్యతో లెక్కించి చూస్తే వచ్చే జీతం ఎంతో చూద్దాం:

ఆర్టీసీ నెలకు చెల్లించే సగటు జీతం: రూ. 260 కోట్లు

ఆర్టీసీ సిబ్బంది: 49,733

సగటు నెల జీతం: 52,279 (సుమారు)

అసలు రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ కంటే తమ సంస్థలో కొందరు ఈడీల జీతం ఎక్కువని కార్మిక సంఘాలు ఆరోపించాయి. డిపో మేనేజర్ కంటే కింది స్థాయి సిబ్బంది సగటు జీతం రూ. 50,000 అని నిరూపిస్తే, తాము ఇప్పటికిప్పుడే సమ్మె విరమిస్తామని వారు సవాల్ విసిరారు.


కేసీఆర్: ఆర్టీసీకి గత ప్రభుత్వం ఐదేళ్లూ కలపి రూ. 712 కోట్లు ఇచ్చింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ. 4,250 కోట్లు ఇచ్చింది. అంటే 597 శాతం అధికంగా ఇచ్చాం.

వాస్తవం: ఈ విషయంలో రెండు వేర్వేరు సమాచారాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆ రెండూ కలిపినా కేసీఆర్ చెప్పినంత నగదు ఆర్టీసీకి అందలేదు. ఒక డాక్యుమెంట్ ప్రకారం.. 2014 నుంచి 2019 మధ్య 784.36 కోట్లు కన్సెషన్ల (రాయితీల) కింద, ప్రభుత్వ హామీ అప్పుల కింద ఇచ్చింది. మరో డాక్యుమెంట్ ప్రకారం రూ. 2,011.55 కోట్లు ఇచ్చింది. కానీ అదే సమయంలో ఆర్టీసీ రోడ్ టాక్స్ కింద దాదాపు రూ. 1,052 కోట్లు ప్రభుత్వానికి కట్టింది. ఈ సంఖ్యను కేసీఆర్ చెప్పలేదు. దీంతో పాటూ అసలు ఏఏ పద్దుల కింద ఆ మొత్తం విడుదల చేశారన్న స్పష్టత కూడా ఇవ్వలేదు.

కేసీఆర్: పట్టణ రవాణా నష్టాలు వస్తుంది కాబట్టి ఆ భారం గ్రేటర్ కార్పొరేషన్ భరించాలి. అలా జీహెచ్ఎంసీ రూ. 330 కోట్లు ఆర్టీసీకి ఇచ్చింది.

వాస్తవం: నిజానికి జిహెచ్ఎంసీ.. ఒక్కసారే.. అంటే 2015-16 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే ఈ సొమ్ము ఇచ్చింది. ఆ తరువాత నుంచి అసలు ఇవ్వలేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఆర్టీసీకి రూ. 1492.70 కోట్లు చెల్లించాల్సి ఉంది.

టీఎస్ ఆర్టీసీ

కేసీఆర్: గ్రేటర్ హైదరాబాద్, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కలిపితే మొత్తం రూ. 4,550 కోట్లు, అంటే ఏడాదికి సగటున రూ. 900 కోట్లు ఇచ్చినట్టు.

వాస్తవం: అసలు ప్రభుత్వం ఇచ్చిన మొత్తం రూ. 4550 కోట్లు ఆర్టీసీకి జమ కాలేదు.

కేసీఆర్: ఈ ఏడాది బడ్జెట్లో రూ. 550 కోట్లు పెట్టాం. ఇప్పటికే రూ. 425 కోట్లు విడుదల చేశాం. అర్థ సంవత్సరం కాలేదు.. అయినా ఇచ్చాం.

వాస్తవం: దీనిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.

కేసీఆర్: పండుగ సమంలో అదనపు ఆదాయం పోయింది. రోజుకు రూ. 11 నుంచి రూ. 17 కోట్లు.. మొత్తంగా రూ. 120 నుంచి రూ. 175 కోట్లు వచ్చే ఆదాయం పోయింది.

వాస్తవం: దీనిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.

టీఎస్ ఆర్టీసీ

కార్మికుల వాదన: ఆర్టీసీ రోజు వారీ సగటు ఆదాయం రూ. 10 నుంచి రూ. 11 కోట్లు ఉంటుంది. పండుగల్లో అదనంగా వచ్చేది కోటిన్నర, రెండు కోట్లు దాటదు అని కార్మికులు వాదిస్తున్నారు.

కేసీఆర్: సమ్మె వల్ల రోజూ వచ్చే ఆదాయం రాకపోగా.. రోజుకు కోటి రూపాయల నష్టం వస్తోంది. అంటే రూ. ఐదు కోట్ల ఖర్చు.. రూ. 4 కోట్ల ఆదాయం వస్తోంది.

వాస్తవం: నిజానికి దీనిపై ఎవరి లెక్కలూ కచ్చితంగా ఉండవు. తాత్కాలిక కండక్టర్లు ఎంత వసూలు చేస్తున్నారు, వారు డిపోల్లో ఎంత చెల్లిస్తున్నారన్న విషయంలో చాలా అనుమానాలు, అభియోగాలు ఉన్నాయి.

కేసీఆర్: ఎన్ఎంయూ అనే సంఘం కోర్టుకు వెళ్లింది. వేరే యూనియన్ సంగతి బయట పెట్టడానికి వీరు కోర్టుకు వెళ్లారు.

వాస్తవం: ఎన్ఎంయూ కాకుండా, వేరే సంస్థ కోర్టుకు వెళ్లింది.


కేసీఆర్: మోటారు వాహనాల చట్టానికి మోదీ ప్రభుత్వం చేసిన సవరణ ప్రకారం సెక్షన్ 67 కింద ఆర్టీసీలు ఉండాల్సిన అవసరం లేదనీ ప్రైవేటు బస్సులకు రూటు పర్మిషన్లు ఇచ్చుకోవచ్చనీ చట్టం వచ్చింది. ఒకప్పుడు ఫోన్లు, విమానాల టికెట్లు ప్రైవేటు రంగం పోటీ వచ్చాక ఎలా మారాయో, అలానే మేము పర్మిట్లు ఇచ్చాక బస్సుల పరిస్థితి కూడా మారుతుంది. నేను ఒక్క సంతకం పెడితే ఆరు, ఏడు వేల బస్సులు తిరుగుతాయి. ఆర్టీసీ కంటే చవగ్గా బస్సులు నడుస్తాయి.

వాస్తవం:కొత్త చట్టం వచ్చిన వాస్తవమే.

కేసీఆర్: ఈ సమ్మె చట్ట విరుద్ధం. ఎస్మా ఉండగా సమ్మె చేయకూడదు. కార్మిక శాఖ దగ్గర చర్చల ప్రొసెస్ నడుస్తున్నప్పుడే వీరు సమ్మెకు వెళ్లారు.

వాస్తవం: ఎమెర్జెన్సీ సర్వీసెస్ మేనేజ్మెంట్ చట్టం కింద ప్రతి ఆరు నెలలకు ఓసారి ఆర్టీసీలో సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూనే ఉంటారు. దాని కింద సమ్మె చేయడం నేరం. కానీ ఆర్టీసీలో జరిగిన అన్ని సమ్మెలూ ఆ చట్టాన్ని ఉల్లంఘించి చేసినవే.

యూనియన్ల వాదన: కార్మిక శాఖ దగ్గర చర్చల ప్రక్రియ ముగిసిన తరువాతే సమ్మెకు వెళ్లాం. సెప్టెంబరు 27నే ఆ ప్రక్రియ ముగిసింది.

కేసీఆర్: ఆఖరికి సమ్మెకు ఒక రోజు అటు ఇటులో వంద కోట్లు ఇచ్చాం. వాటిని బ్యాంకుకు, డీజిల్‌కీ, అద్దె బస్సుల వారికీ కట్టారు. ఇప్పుడు ఆర్టీసీ దగ్గర రూ. 7-8 కోట్లే మిగిలింది.

వాస్తవం: దీనిపై స్పష్టమైన సమాచారం లేదు.

కేసీఆర్: ఆర్టీసీ గురించి నాకన్నా ఎక్కువ అవగాహన ఉన్నవారు లేరు. మూడేళ్లు రవాణా మంత్రిగా ఉన్నాను. నాకు ఆర్టీసీ అంటే అభిమానం కూడా. నేను ఆర్టీసీ బాధ్యతలు తీసుకునే నాటికి రూ. 13.80 కోట్ల నష్టం ఉండేది. నేను కష్టపడి తిరిగి, ఏడాదిన్నరలో రూ. 14.5 కోట్ల లాభాల్లోకి తెచ్చాను. 1997-98లలో ఇది జరిగింది.

వాస్తవం: ప్రస్తుతానికి ఈ లెక్కలు అందుబాటులో లేవు.

కేసీఆర్: భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రీ చేయనట్టుగా డిపో స్థాయి అధికారి నుంచి మీటింగ్ పెట్టా. ఒక హోటల్లో ఒక రోజంతా కూర్చుని వారితో గడిపా. ఏం చేస్తే ఆర్టీసీ బాగుపడుతుందో చెప్పాను.

వాస్తవం: ఆర్టీసీ అధికారులతో సమావేశం జరిగింది

Src:.BBC Telugu

Comments

Popular posts from this blog

సమ్మక్క , సారాలమ్మ జాతర ప్రారంభం సమ్మక్క , సారాలమ్మ విశేషాలు

సమ్మక్క , సారాలమ్మ జాతర ప్రారంభం సమ్మక్క , సారాలమ్మ విశేషాలు    *16 వ తేదీన సారలమ్మ , పగిడిద్దరాజు , గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.*  *17 వ తేదీన సమ్మక్క తల్లి గద్దెపై కొలువు తీరుతుంది .* *18 వ తేదీన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.*  *19 వ తేదీన దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.*  ☘సమ్మక్క మేడారం ఎలా వచ్చింది ?☘ ‘‘పుట్టు భయ్యక్క పేట పురమందు వెలసినా ఆ చందా పరుమయ్యా ఆ యింటి సమ్మక్క.’’ సమ్మక్క భయ్యక్కపేటలో పుట్టింది. ‘చందా’ అనే పేరు గల పరుమయ్య ఇంట్లో ఉండేది. ప్రస్తుతం గుడి బయ్యక్కపేటలో ఉంది. *‘బయ్యక్కపేటలో ఉండలేను. మేడారం పంపించమని’* కోరుతుంది. ‘చందా’ పరుమయ్య మేడారం గ్రామం వచ్చి (మేడారానికి బయ్యక్కపేట 10 కి.మీ దూరంలో ఉంటుంది.) అక్కడి గ్రామ తల్పతి (కులపెద్ద), వడ్డె (పూజారి), అర్థి బిడ్డతో (ఆక్షిశితులను) మాట్లాడి సమ్మక్క *‘బయ్యక్కపేటలో ఉండను’* అంది. కాబట్టి , మేడారం తీసుకెళ్తున్నానని 3 వ గోత్రికం ‘కొక్కెర’ అను ఇంటి పేరు గలవారిని , 5 వ గోత్రికం ‘సిద్ధబోయిన’ అనే ఇంటి పేరుగల వారిని వడ్డెలు ఒప్పించి మేడారంలో దించి పోతాడు. ఆనాటి నుండి ఇప్పటివరకూ వా...

NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే

NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే NTPC Recruitment 2019-20 | దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్ www.ntpccareer.net ఫాలో కావాలి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 స్కోర్ ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఎన్‌టీపీసీలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 10న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్  NTPC careers ;&nbsp ఫాలో కావాలి. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఎన్‌టీపీసీ జారీ చేసిన షార్ట్ నోటిఫికేషన్ కోసం  ఇక్కడ క్లిక్ చేయండి. NTPC Recruitment 20...

సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

*AISSEE 2022 : సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.... వివరాలు ఇలా* *దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది* *ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేషన్‌ ద్వారా ఆరోతరగతి, తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు.* *ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.* *దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 27, 2021 నుంచి ప్రారంభమవుతుంది.*  *దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 26, 2021 వరకు అవకాశం ఉంది.* *ప్రవేశ పరీక్ష (Entrance Test) జనవరి 9, 2022న నిర్వహిస్తారు.* *పరీక్ష ఫీజు ( Exam Fee) నోటిఫికేషన్‌, దరఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సందర్శించండి.* *ముఖ్య సమాచారం* *దరఖాస్తు ప్రారంభం :  సెప్టెంబర్ 27, 2021* *దరఖాస్తకు చివరి తేదీ : అక్టోబర్ 26, 2021* *సవరణలకు అవకాశం : అక్టోబర్ 28, 2021 నుంచి నవంబర్ 2, 2021* *పరీక్ష ఫీజు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.4...