Skip to main content

Featured post

కళ్లుచెదిరే ఆఫర్‌.. కనీవినీ ఎరుగని రాయితీ...... upto 75%

శ్రీ విళంబి నామ సంవత్సర రాశి ఫలితాలు 2018 - 2019

శ్రీ విళంబి నామ సంవత్సర రాశి ఫలితాలు 2018 - 2019.


మేష రాశి:
అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు , భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు , 
కృత్తిక నక్షత్రం 1వ పాదము
ఆదాయం - 02 వ్యయం - 14 రాజపూజ్యం - 05 అవమానం - 07

మేష రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను కలుగచేయును. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు కష్టంతో ఉద్యోగమును పొందును.విదేశీ ఉద్యోగం ప్రయత్నాలు చేయువారికి సంవత్సర ప్రారంభం లో అంత అనుకూలంగా పరిస్థితులు ఉండవు. వ్యాపార రంగంలోనివారికి ప్రారంభ మాసములలో అధిక వ్యయం, ధన సమస్యలు ఏర్పడి ద్వితీయ భాగంలో తగ్గును. సంతాన ప్రయత్నములు చేయువారికి ప్రయత్న ఆటంకములు ఎదురగును. బాగా ఎదిగిన సంతానం స్థిరత్వం విషయంలో సమస్యలు. నూతన ప్రయత్నాలకు శ్రమానంతర విజయం ఏర్పడును. అశ్రద్ధ వలన ఆరోగ్య సమస్యలు తీవ్రమగును. ఈ సంవత్సరం కోర్టు వ్యవహారాలలో విజయం లభించుట కష్టం. విద్యార్ధులకు ఆశించిన విద్య లభించును. చక్కటి పురోగతి ఏర్పడును. ఉద్యోగ జీవనంలోని వారికి ఆశించిన స్థాన చలనములు లభించును. వస్త్ర వ్యాపారములు, కందెన వ్యాపారములు చేయువారికి నష్టములు. రాజకీయ రంగం వారికి పదవీ లాభం. వ్యవసాయదారులకు రెండు పంటలు సామాన్యంగా ఫలించును.
మేష రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన 10 - అక్టోబర్ - 2018 వరకూ చక్కటి అనుకూలమైన ఫలితాలు ఏర్పడును. వివాహ ప్రయత్నములు చేయువారికి ఆశించిన సంబంధములు ఏర్పరచును.11-అక్టోబర్ -2018 నుండి మధ్య మధ్య ధనలాభాములను , మధ్య మధ్య ధన నష్టములను కలుగచేయును. మేష రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని గ్రహం సంవత్సరం అంతా అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. నల్లని వస్తువులు, నల్లని ధాన్యములు వలన లాభములు కలుగచేయును. పితృ వర్గం వారితో వైరములు, అపోహలు ఏర్పడును.
మేషరాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో రాహు - కేతువుల వలన మంచి ఫలితాలు ఏర్పడవు. వాహన ప్రమాదములను, గాయములను కలుగచేయును. శరీర శౌఖ్యం వుండదు. అనేక చిక్కులు ఏర్పరచును. రాహు - కేతువులకు శాంతి జపములు జరిపించుకోనుట మంచిది.


వృషభ రాశి: 
 కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదములు, మృగశిర 1,2 పాదములు
 ఆదాయం - 11 వ్యయం - 05 రాజపూజ్యం - 01 అవమానం - 03.

వృషభ రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో ధనాదాయం ప్రధమార్ధంలో అధికంగా ఉండును. ద్వితియార్ధంలో ఆదాయంలో హెచ్చుతగ్గులు ఏర్పడును. అనుకోనివిధానంలో వాయిదా పడుతున్న పనులు ఈ సంవత్సరం పూర్తి అగును.నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. కానీ ప్రభుత్వ ఉద్యోగం ఆశించువారికి కొద్దిపాటి నిరాశ. సొంత గృహ ప్రయత్నాలు ఫలించును. రాజకీయ రంగంలోనివారికి లౌఖ్యం అవసరం. పట్టుదల వలన గౌరవ భంగం. జూన్, జూలై, ఆగష్టు మాసాలలో వివాదాలు, పోలీస్ కేసులు వలన చికాకులు. విద్యార్ధులకు సామాన్య ఫలితాలు. వ్యాపార వ్యవసాయ రంగం వారికి మధ్యమ ఫలితాలు. వృషభ రాశికి చెందిన స్త్రీలు ఈ సంవత్సరం సంపత్ గౌరీ వ్రతము ఆచరించడం మంచిది.
వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురు గ్రహం 10-అక్టోబర్-2018 వరకూ చెడు ఫలితాలను కలుగచేయును. అనవసర శత్రుత్వములను , అపవాదులను , ఆరోగ్య సమస్యలను, ఆర్ధిక ఇబ్బందులను కలుగచేయును. 11-అక్టోబర్-2018 తదుపరి కొంచెం శాంతించును. అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. అవివాహితుల వివాహ ప్రయత్నములను ఫలవంతం చేయును. కానీ శరీర ధారుడ్యం తగ్గును.
శ్రీ విళంబ నామ సంవత్సరంలో శని గ్రహం సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలను ఏర్పరచును. కష్టార్జితం అంతా వృధాగా మిత్రులకు, బంధువులకు వినియోగించవలసిన పరిస్టితులు ఏర్పరచును. నల్లని వాహనముల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ పరమైన వ్యయం అధికం అగును.
వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో రాహువు వలన సోదర సంబంధ సమస్యలను లేదా తగాదాలను లేదా సోదర వర్గ నష్టములను పొందు సూచన. స్వ విషయాలలో అనుకూలమైన ఫలితాలను ఏర్పరుచును. వృషభ రాశి వారు ఈ సంవత్సరం భాత్రు వర్గం వారికి అప్పులు ఇచ్చుట, వారి కొరకు హామీలు ఉండుట, భాగస్వామ్య వ్యాపారాలు చేయుట మంచిది కాదు. కేతు గ్రహం ఈ రాశి వారికి వైవాహిక జీవనంలో సమస్యలను, జీవిత భాగస్వామికి అనారోగ్యమును ఏర్పరచును. విడాకులు ఆశిస్తున్న వారికి ఈ సంవత్సరం విడాకులు , కళత్ర నష్టం ఏర్పడును. ఆర్ధికంగా మిశ్రమ ఫలితాలు కలుగచేయును కంప్యూటర్ software తో సంబoధం లేకుండా జాతకం రాయటం మా ప్రత్యేకత
.
మిధున రాశి:
మృగశిర 3 , 4 పాదములు , ఆరుద్ర 1,2,3,4 పాదములు, పునర్వసు 1,2,3 పాదముల
 ఆదాయం - 14 వ్యయం - 02 రాజపూజ్యం - 04 అవమానం - 03

శ్రీ విళంబి నామ సంవత్సరంలో మిధున రాశి వారు కొద్దిపాటి అసంతృప్తిని ఎదుర్కొందురు. ఆశించిన విజయాలు పూర్తిగా నెరవేరుట కష్టం.ధనాదాయంలో హెచ్చుతగ్గులు ఏర్పడుచుండును. మీ మీ సొంత జాతకంలోని గ్రహ బలాలపై ఈ సంవత్సరం ఆదాయం ఆధారపడును.ధనవ్యయం అధికమగును. సంవత్సరం మధ్య భాగం నుండి కొంత అనుకూలత ప్రారంభం అగును. చేపట్టిన నూతన పనులు లాభించును. దూర ప్రాంత నివాశ ప్రయత్నాలు , ఉద్యోగ అన్వేషణ ఫలించును.వివాహ ప్రయత్నములు ఈ సంవత్సరం కష్టం మీద ఫలించును. ఉద్యోగ జీవులకు సామాన్య ఫలితాలు. వ్యాపార రంగంలోని వారికి అంత అనుకూలత లేదు.పోటీదారులు పెరుగును. యువకులకు వాహన సంబంధ ప్రమాదాలు లేదా సమస్యలు. జాగ్రత్త అవసరం. పెద్ద వయస్సు వారికి మూత్ర సంబంధ సమస్యలు, ధన వ్యయ సూచన. కాళారంగంలోనివారికి మంచి గుర్తింపు. వైద్య రంగంలోనివారికి అనుకూలమైన కాలం.వ్యవసాయ దారులకు మిశ్రమ పంటలు కలసి వచ్చును. విద్యార్ధులకు జయం.
మిధున రాశి వారు శ్రీ విళంబి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా కొద్దిపాటి అనుకూలమైన ఫలితాలనే పొందుదురు. భూ సంబంధ లేదా గృహ సంబంధ వ్యాపారములు చేయువారికి విశేష లాభం. సంతాన ప్రయత్నములు చేయువారికి చక్కటి పుత్ర సంతాన సూచన.11 - అక్టోబర్ -2018 తదుపరి జీవిత భాగస్వామికి మధ్య మధ్య ఆరోగ్య సమస్యలు.
శ్రీ విళంబి నామ సంవత్సరంలో మిధున రాశి వారు శని గ్రహం వలన వైవాహిక జీవనంలో అపసవ్యతలు ఎదుర్కొనుటకు సూచనలు అధికం. జీవిత భాగస్వామితో తగాదాలు లేదా అవిధేయత ఏర్పడును.పునర్భూ వివాహ ప్రయత్నాలు మాత్రం చక్కగా ఫలించును. ప్రేమ వ్యవహారములలో ఉన్నవారు కష్టాలు ఎదుర్కొండురు. ఆర్ధికంగా శని పెద్దగ ఇబ్బందులు కలుగచేయాడు.
శ్రీ విళంబి నామ సంవత్సరంలో మిధున రాశి వారికి రాహువు కలసిరాడు. ఆర్ధిక సమస్యలు, ఋణములు కలుగచేయును. ఆరోగ్య భంగములు, ప్రమాదాలు ఏర్పరచును. కేతువు ఈ రాశి వారికి పూర్వీకుల సంబంధమైన స్థిరాస్తిని పొందుటకు సహకరించును.కంప్యూటర్ software తో సంబoధం లేకుండా జాతకం రాయటం మా ప్రత్యేకత

కర్కాటక రాశి:
పునర్వసు నక్షత్ర 4 వ పాదం , పుష్యమి నక్షత్ర 1,2,3,4 పాదములు, ఆశ్లేషా నక్షత్ర 1,2,3,4 వ పాదములు
ఆదాయం - 08 వ్యయం - 02 రాజపూజ్యం - 07 అవమానం - 03

శ్రీ విళంబి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ధనాదాయం బాగుండును. నూతన ప్రయత్నాలు లభించును. వ్యాపార - వ్యవహారాలు అనుకూలించును. ఆలోచనలను కార్యారుపంలోనికి తీసుకోనిరాగలరు. ఈ సంవత్సరం కర్కాటక రాశికి చెందిన అన్ని వర్గములవారికి మంచి ఫలితాలు ఏర్పడును.
శ్రీ విళంబి నామ సంవత్సరంలో గురువు కర్కాటక రాశి వారికి సంవత్సరం అంతా అనుకూలమై ఉండును. విద్యార్ధులకు అతి చక్కటి ఆశించిన విద్య లభించును. భూసంబంధ వ్యాపారం లేదా వ్యవసాయం చేయువారికి మంచి లాభాలు కలుగును. వాహన యోగమును ఏర్పరచును. సంతాన ప్రయత్నములు చేయువారికి 11-అక్టోబర్ - 2018 తదుపరి చక్కటి సంతాన ప్రాప్తిని కలుగచేయును.
శని వలన శ్రీ విళంబి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అంత మంచి జరుగదు. సంవత్సరంలో చిన్న చిన్న తగాదాలను , ఆరోగ్య సమస్యలను ఏర్పరచును. ఈ సంవత్సరం రాహువు మంచి ఫలితాలను కలుగాచేయడు. ఇతరులతో పరుషంగా మాట్లాడునట్టు, దయా దాక్షిన్యాలను మరచి ప్రవర్తించునట్టు చేయును. కేతువు సంతాన సంబంధ విషయాలలో ఇబ్బందులను ఏర్పరచువాడు అగును. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు సర్ప దోష నివారణ పూజ జరిపించుకోనుట మంచిది.
సింహ రాశి:
మఘ 1,2,3,4 పాదములు , పుబ్బ 1,2,3,4, పాదములు , ఉత్తర 1వ పాదం
 ఆదాయం - 11 వ్యయం - 11 రాజపూజ్యం - 03 అవమానం - 06

శ్రీ విళంబి నామ సంవత్సరం సింహ రాశి వారికి అంత అనుకూలంగా వుండదు. తలపెట్టిన ప్రయత్నాలు విజయవంతము అగుట కష్టం. వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా ఉండును. నూతన వ్యాపారములు లాభించవు. వివాహ ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలను ఇచ్చును. అవసరములకు ధనం సర్దుబాటు జరుగుటలో ఇబ్బందులు ఏర్పడును. ఆర్ధికంగా ఋణములు చేయుదురు. మాటగౌరవంతో వ్యవహారాలు కొనసాగును. ఉద్యోగ జీవనం వారికి సామాన్య ఫలితాలు. పదోన్నతులకు అనువైన సమయం కాదు. విద్యార్ధులు శ్రమించవలెను. వ్యవసాయం మిశ్రమ ఫలితాలు కలిగించును. సంతాన ప్రయత్నాలు చేయువారికి దైవ ఆశీస్సులు అవసరం.
సింహ రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన 10-అక్టోబర్-౨౦౧౮ వరకూ అనుకూలమైన ఫలితాలు పొందలేరు. సోదర సోదరీ వర్గం వలన సమస్యలు ఎదుర్కొందురు. 11-అక్టోబర్-2018 తదుపరి భూ లేదా గృహసంబంధ భాగ్యం పొందేదురు. దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలించుట కష్టం. శనికి శాంతులు అవసరం.రాహు - కేతువులు ఇరువురు సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఇవ్వరు. పిత్రార్జితం లేదా వారసత్వ సంపద వ్యయమగు పరిస్థితులు కలుగచేయును
.
కన్యా రాశి:
ఉత్తర 2,3,4 పాదములు, హస్త 1,2,3,4 పాదములు , చిత్త 1,2 పాదములు 
 ఆదాయం - 14 వ్యయం - 02 రాజపూజ్యం - 06 అవమానం - 06

కన్యా రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ప్రాప్తించును.ఉద్యోగ, వ్యాపార , వృత్తి జీవనముల వారికి మంచి ఫలితాలు ఏర్పడును. అవివాహితుల వివాహ ప్రయత్నములు చివరి సమయంలో సమస్యలను ఏర్పరచు సూచన. సంతాన ప్రయత్నములు చేయువారు నిరాశ చెందుటకు అవకాశములు కనిపించుచున్నవి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమగును. నూతన వ్యాపారములు, భాగస్వామ్య వ్యాపారములు ఈ సంవత్సరం ప్రారంభించకుండా ఉండుట మంచిది. సొంత ఇంటి కొరకు ప్రయత్నములు చేయుటకు, స్థిరాస్తులు కొనుటకు ఈ సంవత్సరం కలసివచ్చును. వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలించును. విద్యార్ధులకు సామాన్య ఫలితాలు.
శ్రీ విళంబి నామ సంవత్సరంలో కన్యారాసి వారికి గురువు 10-అక్టోబర్-2018 వరకూ ఆర్ధికంగా కలసివచ్చును. కానీ ఆరోగ్యములక సమస్యలను, చికాకులను కలుగచేయును. ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్త అవసరం. 11-అక్టోబర్-2018 నుండి ఆర్ధికంగా కూడా అంతగా కలసిరాడు. జాతకంలో గురుబలం లేని చిన్న పిల్లలకు బాలారిష్టములు ఏర్పరచును.
కన్యా రాశి వార్కి శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని యోగించడు. సంతానంతో గొడవలు, కుటుంభ జీవనంలో సమస్యలు, విద్యార్ధులకు ఆటంకాలు, వారసత్వ సంబంధ విషయాలలో చిక్కులు, కొద్దిపాటి పిత్రార్జిత వ్యయమును లేదా నష్టమును కలుగచేయును.
కన్యా రాశి వారికి ఈ 2018 - 2019 సంవత్సరంలో రాహువు వలన అంతగా సమస్యలు ఏర్పడవు. రాహువు అధికంగా ప్రయానములను కలుగచేయును. పుణ్యక్షేత్ర దర్శనములు ఏర్పరచును.కేతువు కూడా అనుకూలమైన ఫలితాలు కలుగచేయును. భూసంబంధ వ్యాపారములు చేయువారికి , కంట్రాక్టు పనులు చేయువారికి అనుకూలమైన ఫలితాలు ఇచ్చును.కంప్యూటర్ software తో సంబoధం లేకుండా జాతకం రాయటం మా ప్రత్యేకత

తులా రాశి:
చిత్త 3,4 పాదములు, స్వాతి 1,2,3,4 పాదములు , విశాఖ 1,2,3 పాదములు
 ఆదాయం - 11 వ్యయం - 05 రాజపూజ్యం - 02 అవమానం - 02

తులా రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరం ఆర్ధికంగా అనుకూలం. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి చక్కటి స్థిరత్వం లబించును. ఉద్యోగ జీవనంలో ఆశించిన పదోన్నతులు ఏర్పడును. గృహ నిర్మాణం చేయువారికి సమస్యలు. దూర ప్రాంత స్థానచలనం కొరకు ప్రయత్నించు వారికి ఆగష్టు తదుపరి అనుకూలత.విద్యార్ధులకు ఆశించిన ఫలితాలు. న్యాయవాద వృత్తి చేయువారికి కెరీర్ పరంగా ఒడిదుడుకులు. సంతాన ప్రయత్నములకు కేతు గ్రహం వలన సమస్యలు.
శ్రీ విళంబి నామ సంవత్సరంలో తులా రాశి వారికి గురువు సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఇవ్వడు. రక్త సంబంధ ఆరోగ్య సమస్యలను, తగాదాలను, కోర్టు కేసులలో అపజయాలను, శత్రు వృద్ధిని ఏర్పరచును. వడ్డీ వ్యాపారం చేయువారికి అనగా ఫైనాన్సు రంగం వారికి మంచి లాభాలను కలుగచేయును.
శని వలన తులారాశి వారు సామాన్య ఫలితాలు పొందును. అభివృద్ధిని కలిగించడు మరియు తీవ్ర నష్టములు కలుగచేయడు. కనిష్ట సోదరుల వలన మానసిక అశాంతిని , వారితో సమస్యలను ఏర్పరచును. ఈ సంవత్సరం రాహువు వలన తులారాశి వారు మంచి ఫలితాలు పొందును. ప్రయనములందు జయమును, దూర దేశ నివాసము, వీసాల కొరకు ప్రయత్నించువారికి అనుకూల ఫలితాలు కలుగచేయును. కేతువు సంతాన ప్రయత్నములు చేయువారికి ప్రయత్న భంగములు ఏర్పరచునుకంప్యూటర్ software తో సంబoధం లేకుండా జాతకం రాయటం మా ప్రత్యేకత

వృశ్చికరాశి రాశి:
విశాఖ 4 వ పాదము, అనురాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు
ఆదాయం - 02 వ్యయం - 14 రాజపూజ్యం - 05 అవమానం - 02

శ్రీ విళంబి నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారు ఏలినాటి శని దశ ప్రభావం వలన సమస్యలను ఎదుర్కొందురు. విదేశీ జీవనం ఆశించు వారికి ప్రయత్నములు ఫలించవు. సంతాన లేమి కల్గిన దంపతుల సంతాన ప్రయత్నాలు దైవ ఆశ్సిస్సులతో ఫలమంతమవ్వాలి. పుణ్య క్షేత్ర సందర్శన చేయుదురు. పట్టుదల లోపించును. వ్యయం అధికంగా ఉండును. నూతన స్నేహాల వలన సమస్యలు. విద్యార్ధులకు అధిక శ్రమ అవసరం. వ్యవసాయదారులకు ఋణాలు. లోహములు, కందెనలు , నువ్వులు వంటి శని ఆధిపత్యం కలిగిన వస్తువులతో వ్యాపారం చేయువారికి లాభాలు. ఈ సంవత్సరం వృచ్చిక రాశి వారు లాటరీలు , గుర్రపు పందాలు, జూదం లలో పాల్గొనకుండా ఉండుట మంచిది. రాజకీయ, క్రీడారంగం, కాళారంగంలోని వారికి మధ్యమ ఫలితాలు. ధన నష్టములు. వృత్తి జీవనంలోనివారికి సామాన్య ఫలితాలు.
శ్రీ విళంబి నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి గురు గ్రహం వలన 10-అక్టోబర్-2018 వరకూ కొద్దిపాటి ఋణములు ఏర్పడును. కానీ మంచి కార్యక్రమాల కొరకు ధనాన్ని వినియోగించెదరు. 11-అక్టోబర్-2018 నుండి గురువు పూర్తిగా కలసివచ్చును. చక్కటి ఆర్ధిక బలాన్ని ఇచ్చువాడు అగును. నూతన ధనార్జన మార్గాలకు దారి చూపును. ఎరుపు రంగు కలసి వచ్చును.గౌరవ ప్రతిష్టలు ఏర్పరచును.
శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని వలన మంచి ఫలితాలు ఉండవు. ఏలినాటి శని దశ విచారములు, అనవసర ఖర్చులు,నేత్ర సంబంధ ఆరోగ్య సమస్యలు ప్రసాదించును. శనికి శాంతి అవసరం. ఈ సంవత్సరం వృచ్చిక రాశి వారికి రాహువు భూ సంబంధ సంపదకు సంబందించిన లాభమును చేకుర్చును. గృహ ప్రయత్నాలు అనుకూలం చేయును. కేతువు మాత్రం కలసిరాడు. ప్రయత్న ఆతంకములను, అపజయాలను, దైవ దుషనలను చేయునట్టు చేయును.

ధనుర్ రాశి / ధనస్సు రాశి:
మూల 1,2,3,4 పాదములు, పుర్వాషాడ 1,2,3,4 పాదములు, ఉత్తరాషాడ 1 వ పాదము
ఆదాయం - 05 వ్యయం - 05 రాజపూజ్యం - 01 అవమానం - 05

ధనుర్ రాశి వార్కి శ్రీ విళంబి నామ సంవత్సరం మంచి చెడుల మిశ్రమంగా ఉండును. నూతన వ్యాపారాలు, వ్యవహారాలు లాభించును. ఉద్యోగ అన్వేషణ చేయువారికి, వలసదారులకు వారి వారి కోరికలు నెరవేరును. వివాహ ప్రయత్నాలు నిష్పలం. యంత్ర తయారీ పరిశ్రమదారులకు లాభాలు. వస్త్ర రంగ పరిశ్రమదారులకు , చేనేత వర్గం వారికి నష్టములు. ఆరోగ్య పరంగా సుఖ వ్యాదుల వలన సమస్యలు.
శ్రీ విళంబి నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారు గురు గ్రహం వలన 10-అక్టోబర్-2018 వరకూ మంచి ఫలితాలు పొందును. సక్రమ మార్గంలో విశేష ధనాదాయం ఏర్పడును. ప్రభుత్వా ఉద్యోగులకు అంతగా కలసిరాడు. గౌరవ హాని, అపకీర్తి. బృహస్పతి జాతకులు ధర్మ మార్గంలో నడచునట్లు చేయును. శుభ ఫలితాలు ఏర్పరచును. 10-అక్టోబర్-2018 తదుపరి ఇదే బృహస్పతి కలసిరాడు. వ్యవహర చిక్కులను, ఆరోగ్య సమస్యలను ఏర్పరచును.
శ్రీ విళంబి నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ వలన ధనుర్ రాశి వారు అనుకూలమైన ఫలితాలు తక్కువ స్థాయిలో పొందుదురు. శరీర సౌఖ్యం దూరమగును. సులువుగా పూర్తి కావలసిన పనులు కూడా అధిక శ్రమను కలుగచేయును. ఆర్ధిక పరిస్థితులు అదుపులో ఉండవు. కుటుంభ సభ్యులు మరియు సంతాన ప్రవర్తన మానసిక చికాకులు కలుగచేయును. ధనుర్ రాశి వారికి రాహు - కేతువులు ఇరువురు కలసిరారు. శారీరక సమస్యలు, కష్టములు, మానసిక ఆందోళన కలుగచేయును.కంప్యూటర్ software తో సంబoధం లేకుండా జాతకం రాయటం మా ప్రత్యేకత
మకర రాశి:
ఉత్తరాషాడ 2,3,4 పాదములు, శ్రవణం 1,2,3,4 పాదములు, ధనిష్ఠ 1,2, పాదముల
 ఆదాయం - 08 వ్యయం - 14 రాజపూజ్యం - 04 అవమానం - 05

మకర రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరం మంచి ధనలాభాలను కలుగచేయును. ఆశించిన ధనము సంపాదిన్చుకొండురు. అదేవిధంగా వీరి చేతిపై ఖర్చు కూడా ఉండును. ఉద్యోగ జీవులు, వ్యాపారములు , ప్రొఫెషనల్ వృత్తులు వారు మంచి అభివృద్ధిని పొందును. వివాహ సంబంధాలు కుదురును. స్థానచలన ప్రయత్నాలు ఆటంకములను ఏర్పరచును. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కలసివచ్చును. ఆశించిన ఉద్యోగం లభించును. జీవన పోరాటంలో జయం. కుటుంబ జీవనంలో స్త్రీలకు ప్రోత్సాహవంతమైన కాలం. వైవాహిక జీవనంలో సంతోషం. సంతాన భాగ్యం. కోర్టువ్యవహారాలు అనుకూలం కాదు.
శ్రీ విళంబి నామ సంవత్సరంలో మకర రాశి వారికి గురు గ్రహం సంవత్సరం అంతా మంచి ఫలితాలు కలుగచేయును. ప్రజా పాలకులకు పేరు ప్రతిష్టలు, విద్యార్ధులకు వున్నత విద్య, చక్కటి ధనార్జన, సంపద భాగ్యములు ఏర్పరచును. చేతివృత్తులు, కుల వృత్తి చేయువారికి అతి చక్కటి కాలం.
శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని గ్రహం ఏలినాటి శని ప్రభావం వలన జాతకులు ప్రగల్భాలకు పోయి విశేషమైన ధనవ్యయం చేయును. ఆర్ధిక పరంగా ఏలినాటి శని దశ కలసిరాదు. ఈ సంవత్సరం మకర రాశి వారు రాహు గ్రహం వలన శారీరక వ్యాధులను, వివాహ ప్రయత్నాలలో ఆటంకములను, బంధువర్గం వలన నమ్మకద్రోహములను ఎదుర్కొందురు. కేతువు వలన మంత్రం నష్టములు ఉండవు.కంప్యూటర్ software తో సంబoధం లేకుండా జాతకం రాయటం మా ప్రత్యేకత 
                                                                      కుంభ రాశి:
ధనిష్ఠ 3,4 పాదములు, శతభిషం 1,2,3,4 పాదములు, పూర్వాభాద్ర 1,2,3,4 పాదముల
 ఆదాయం - 08 వ్యయం - 14 రాజపూజ్యం - 07 అవమానం - 05

శ్రీ విళంబి నామ సంవత్సరంలో కుంభ రాశి వారు చక్కటి ఫలితాలు పొందుదురు. సంవత్సర ప్రారంభ మాసాలలో ధనం కొద్దిగా వృధా వ్యయం అగును. వ్యాపార వ్యవహారములు , వృత్తి పనులు నిదానంగా ఫలించును. సొంత గృహసంబంధమైన కోరికలు నెరవేరును. వ్యవసాయదారులకు ఆటంకములు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించును. వివాహ సంబంధాలు సఫలమగును. మాత్రు వర్గీయులకు ఈ సంవత్సరం మంచిది కాదు.
శ్రీ విళంబి నామ సంవత్సరంలో కుంభ రాశి వారు గురు గ్రహం వలన సంవత్సరం అంతా మంచి ఫలితాలు పొందును. వారసత్వ సంపద వలన, స్వార్జిత ధనం వలన మంచి భాగ్యం ఏర్పరచుకొండురు. 11-అక్టోబర్-2018 తదుపరి వృత్తి జీవనం చేయువారికి అత్యంత లాభాపూరిత కాలం. మిక్కిలి పేరు ప్రఖ్యాతలు , ధనము సంపాదిన్చుకొండురు.
శ్రీ విళంబి నామ సంవత్సరం లో కుంభ రాశి వారు శని గ్రహం వలన కూడా ఆర్ధికంగా అనుకూల ఫలితాలు పొందును. వ్యక్తిగత జీవనంలో అనగా జీవిత భాగస్వామితో సమస్యలు ఏర్పరచును. కుంభ రాశి వారికి ఈ సంవత్సరం రాహువు వలన సమస్యలు, శత్రు వ్రుద్ధి, ఆరోగ్య సమస్యలు ఏర్పడును. కేతువు విద్యార్ధులకు మంచి చేయును. ఆశించిన విద్యావ్రుద్ధిని ప్రసాదించును. జాతకులు ఉన్నత విద్యావంతులు అగును.కంప్యూటర్ software తో సంబoధం లేకుండా జాతకం రాయటం మా ప్రత్యేకత


మీనరాశీ 
పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు, రేవతి 1,2,3,4 పాదముల
ఆదాయం - 05 వ్యయం - 05 రాజపూజ్యం - 03 అవమానం – 01

మీనరాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరం అధిక శాతం శుభ ఫలితాలు కలుగచేయును. ముఖ్యంగా ద్వితియార్ధం అధికమైన లాభాలను కలుగచేయును. ఉద్యోగ అన్వేషణలో వున్నవారు చక్కటి ఉద్యోగాన్ని పొందేదురు. సంతానం యొక్క స్థిరత్వంలో సమస్యలు కలుగును. చేపట్టిన ప్రయత్నములు కష్టంతో ప్రారంభం ఇయినా అనుకూలమైన దిశలో పయనించి ఫలవంతంగా ముగియును
. శ్రీ విళంబి నామ సంవత్సరం లో మీనరాశి వారు గురుగ్రహం వలన 10-అక్టోబర్-2018 వరకూ అననుకూల ఫలితాలు, 11-అక్టోబర్-2018 తదుపరి అత్యంత చక్కటి ఫలితాలను పొందును. విశేషమైన భూ లేదా గృహ సంపదను కలుగచేయును. వారసత్వం వలన, స్వార్జితం వలన కలసివచ్చును. శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని మీనరాసి వారికి సంవత్సరం అంతా మంచి చేయును. విశేష ధనార్జన ఇచ్చువాడు అగును. కానీ ఆర్ధిక విషయాలలో లోభత్వం ప్రదర్శించు పరిస్థితులు కలుగచేయును. మీనా రాశి వారికి రాహు - కేతువులు ఇరువురు ఆర్ధికంగా, ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉండును. ఆయుర్భాగ్యములు సంపూర్ణంగా ఇచ్చును. కానీ రాహువు వలన సంతాన సంబంధిత విషయాలలో నష్టం లేదా సంతానం మీ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించునట్టు చేయును. సంతానం వలన ప్రశాంతత వుండదు. 

Comments

Popular posts from this blog

సమ్మక్క , సారాలమ్మ జాతర ప్రారంభం సమ్మక్క , సారాలమ్మ విశేషాలు

సమ్మక్క , సారాలమ్మ జాతర ప్రారంభం సమ్మక్క , సారాలమ్మ విశేషాలు    *16 వ తేదీన సారలమ్మ , పగిడిద్దరాజు , గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.*  *17 వ తేదీన సమ్మక్క తల్లి గద్దెపై కొలువు తీరుతుంది .* *18 వ తేదీన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.*  *19 వ తేదీన దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.*  ☘సమ్మక్క మేడారం ఎలా వచ్చింది ?☘ ‘‘పుట్టు భయ్యక్క పేట పురమందు వెలసినా ఆ చందా పరుమయ్యా ఆ యింటి సమ్మక్క.’’ సమ్మక్క భయ్యక్కపేటలో పుట్టింది. ‘చందా’ అనే పేరు గల పరుమయ్య ఇంట్లో ఉండేది. ప్రస్తుతం గుడి బయ్యక్కపేటలో ఉంది. *‘బయ్యక్కపేటలో ఉండలేను. మేడారం పంపించమని’* కోరుతుంది. ‘చందా’ పరుమయ్య మేడారం గ్రామం వచ్చి (మేడారానికి బయ్యక్కపేట 10 కి.మీ దూరంలో ఉంటుంది.) అక్కడి గ్రామ తల్పతి (కులపెద్ద), వడ్డె (పూజారి), అర్థి బిడ్డతో (ఆక్షిశితులను) మాట్లాడి సమ్మక్క *‘బయ్యక్కపేటలో ఉండను’* అంది. కాబట్టి , మేడారం తీసుకెళ్తున్నానని 3 వ గోత్రికం ‘కొక్కెర’ అను ఇంటి పేరు గలవారిని , 5 వ గోత్రికం ‘సిద్ధబోయిన’ అనే ఇంటి పేరుగల వారిని వడ్డెలు ఒప్పించి మేడారంలో దించి పోతాడు. ఆనాటి నుండి ఇప్పటివరకూ వా...

NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే

NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే NTPC Recruitment 2019-20 | దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్ www.ntpccareer.net ఫాలో కావాలి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 స్కోర్ ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఎన్‌టీపీసీలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 10న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్  NTPC careers ;&nbsp ఫాలో కావాలి. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఎన్‌టీపీసీ జారీ చేసిన షార్ట్ నోటిఫికేషన్ కోసం  ఇక్కడ క్లిక్ చేయండి. NTPC Recruitment 20...

సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

*AISSEE 2022 : సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.... వివరాలు ఇలా* *దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది* *ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేషన్‌ ద్వారా ఆరోతరగతి, తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు.* *ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.* *దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 27, 2021 నుంచి ప్రారంభమవుతుంది.*  *దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 26, 2021 వరకు అవకాశం ఉంది.* *ప్రవేశ పరీక్ష (Entrance Test) జనవరి 9, 2022న నిర్వహిస్తారు.* *పరీక్ష ఫీజు ( Exam Fee) నోటిఫికేషన్‌, దరఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సందర్శించండి.* *ముఖ్య సమాచారం* *దరఖాస్తు ప్రారంభం :  సెప్టెంబర్ 27, 2021* *దరఖాస్తకు చివరి తేదీ : అక్టోబర్ 26, 2021* *సవరణలకు అవకాశం : అక్టోబర్ 28, 2021 నుంచి నవంబర్ 2, 2021* *పరీక్ష ఫీజు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.4...