దేవుని మించిన తోడు
రాముని మించిన ఱేడు
భర్తని మించిన పనోడు
వెదకిన దొరకరు ఏనాడు
కాలము వేసెను గాలము
పెళ్లొక మాయాజాలము
భార్యకు భర్తే దైవము
మరి ఎందుకు నిత్యము కయ్యము
రెక్కలు విరిగిన పక్షులు
చెట్లుగ మారని విత్తులు
కత్తులు పోయిన శూరులు
పతులుగ మారిన పురుషులు
తిరిగెను ఎన్నో గుళ్ళు
వేసెను మూడే ముళ్ళు
వాచెను రోజూ ఒళ్లు
అయ్యో పాపం మొగుళ్ళు
క్షయుడై పోయెను చంద్రుడు
సగమై పోయెను శివుడు
సంద్రము దాటెను రాముడు
దేవుడి పాపమె మగడు
పెళ్ళాం పట్టిన పంతము
తీర్చిన కథ సుఖాంతము
లేనిచో సాధింపే జీవితాంతము
ఇదే అసలు సిసలు వేదాంతము
రాయిని తన్నగనేల
గోడను గుద్దుటనేల
నిప్పున దూకుటనేల
భర్తగ మారగనేల?
వచ్చెడి భావము ఆగదు
శతకము రాసిన చాలదు
ఇది నా భార్యకు నిజముగ నచ్చదు
నను కొట్టక మాత్రము వదలదు
*_-భయపడి పేరు కూడా వ్రాయని అజ్ఞాత రచయిత_*
Sir -- This is my poem ... where did you get it?
ReplyDeleteమీ పేరు చెప్పండి మిత్రమా .....!
Delete