హైదరాబాద్ :
పదవతరగతి, ఇంటర్ పాసైన నిరుద్యోగ యువతీ యువకులకు టెక్ మహీంద్రా ఫౌండేషన్ క్యాడర్ సహకారంతో మూడు నెలల పాటు కంప్యూటర్ బేసిక్స్, ఇంగ్లీష్ టైపింగ్‌లో ఉచితంగా మూడు నెలలపాటు శిక్షణ ఇచ్చి కార్పొరేట్ సంస్థనుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ పాజెక్టు మేనేజర్ ఎ. వెంకటేష్ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పాస్, ఫెయిల్ అయిన 18 నుంచి 27 సంవత్సరాలోపు వయస్సు గల అభ్యర్థులు తమ పేర్లను సికింద్రాబాద్ స్మార్ట్ సెంటర్ నందు ఈ నెల 15 వ తేదీ వరకు
దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8885512034, 8885512033 సంప్రదించగలరని కోరారు.
Comments
Post a Comment