నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి స్వయం సహాయక సంఘాల మహిళలకు స్మార్ట్ ఫోన్స్ అందించాలని నిర్ణయించింది స్త్రీనిధి బ్యాంకు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ ను ప్రోత్స హించేందుకు పొదుపు సంఘం మహిళలకు మొబైల్ ఫోన్లు అందించాలన్న కొత్త ఆలోచన వచ్చింది స్త్రీనిధి బ్యాంకు అధికారులకు.
రూ.50 కోట్లతో దాదాపు 84 వేల మందికి డిజిటల్ ఫోన్లను ఈ ఏడాది అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ ఇండియా సాధించేందుకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్న ట్లు స్త్రీనిధి బ్యాంకు వెల్లడించింది. ఫీభ్రవరి 4న సచివాలయంలో జరిగిన స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు బ్యాంకు చైర్‌పర్సన్ అనిత.
పొదుపు సంఘాల మహిళలకు మొబైల్ ఫోన్ సమకూర్చడానికి.. ఒక్కో మహిళకు రూ.6 వేల చొప్పున స్త్రీనిధి బ్యాంకు రుణమిస్తోందని ఎండీ చెప్పారు. ఈ రుణాన్ని నెలకు రూ.275 చొప్పున కనీస వడ్డీతో 24 నెలల్లోపు చెల్లించాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు వారికి నచ్చిన మోడల్, నచ్చిన కంపెనీ మొబైల్‌ను తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు.
Comments
Post a Comment