తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో అందజేయనున్న ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కార్మికశాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో భాగంగా దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, మోటారు రవాణా సంస్థలు, సహకార, ధార్మిక సంస్థలు, ఇతర ట్రస్టుల్లో పని చేస్తున్న కార్మికుల పిల్లలు ఇందుకు అర్హులని తెలిపారు. దరఖాస్తుల ఫారాలు కార్మికశాఖ కార్యాలయంలో లభిస్తాయని… ఈ నెల 28లోపు దరఖాస్తులను పూరించి అందజేయాలని సూచించారు. పదో తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, మెడిసిన్, లా, బీఎస్సీ (అగ్రికల్చర్, వెటర్నరీ, నర్సింగ్, హార్టికల్చర్), బీసీఏ, ఎంసీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీబీఏ, ఎంబీఏ, డిప్లోమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నిషియన్, పీజీ డిప్లామా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నిషియన్ కోర్సులు చేస్తున్న వారికి రూ.1000 నుంచి రూ. రెండు వేల వరకు స్కాలర్ షిప్ లు వస్తాయన్నారు. అభ్యర్థులను వారి తరగతులు, కోర్సుల్లో మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేస్తామని తెలిపారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీసీ, ఈబీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈ నెల 15వరకు ఆన్‌లైన్‌లో...