ఇంటికి దీపం అమ్మాయి అనే చైతన్యంతో కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన (ఎస్.ఎస్.వై) తీసుకొచ్చింది. ఇది చిన్న మొత్తాల పొదుపు పథకం. ఈ పథకం ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. అమ్మాయికి 21 సంవత్సరాలు నిండినపుడు ఈ పథకం మెచ్యూరిటీకి వస్తుంది. చదువు, పెళ్లి అవసరాలకు సహాయపడే విధంగా రూపొందించిన పొదుపు పథకం ఇది. డిఫాల్ట్ లేకుండా మెచ్యూరిటీ అయ్యే దాకా నిర్ణీత సొమ్ము కడితే ఖాతా ముగిసే సమయానికి సమయానికి రూ.71 లక్షల వరకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ డిపాజిట్‌పై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంది. ప్రయోజనం ఏమిటి? సమాజంలో ఆడపిల్ల పట్ల ఉన్న వివక్షతా భావం పోగొట్టే లక్ష్యంతో 2015, జనవరి నెలలో ‘బేటీ బచావో, బేటీ పడావో’(‘సేవ్ ది గర్ల్ ఛైల్డ్, ఎడ్యుకేట్ ది గర్ల్ ఛైల్డ్’) పాలసీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే ‘సుకన్య సమృద్ధి యోజన’ను కూడా ప్రారంభించింది. ఆడపిల్లల పెంపకం, బాధ్యతల విషయంలో అమ్మాయి తల్లిదండ్రులు లేదా గార్డియన్ ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఈ పొదుపు పథకం ఆర్థికంగా అండగా ఉంటుంది. అమ్మాయిల చదువు, పెళ్లి ఖర్చులకు కావాల్సిన డబ్బును దీర్ఘకాలంలో అందిస్తూ వాళ్లకి ఉన్నత భవిష్యత్తును చూపిస్తు...