Skip to main content

Posts

Showing posts from October, 2020

Featured post

కళ్లుచెదిరే ఆఫర్‌.. కనీవినీ ఎరుగని రాయితీ...... upto 75%

బతుకమ్మ పండుగలో రోజుకొక్కో రకమైన ప్రత్యేక నైవేద్యం

తెలంగాణలో బతుకమ్మ పండుగకు  ప్రసిద్ధమైంది. అమావాస్య నాడు ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కోక రకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ సంవత్సరం అధిక ఆశ్వీయుజ మాసం రావడం వలన ఈ పండగను నిజ ఆశ్వీయుజ మాసం ప్రారంభంతో జరుపుకుంటారు. 16 అక్టోబర్ 2020శుక్రవారం, అమావాస్య రోజు  ఎంగిలి పువ్వు బతుకమ్మని పేరుస్తారు. అమావాస్య నుండి 24 అక్టోబర్ శనివారం రోజు సద్దుల బతుకమ్మని "దుర్గాష్టమి" మహర్నవమిగా వేడుక చేసుకుంటారు. ఈ బతుకమ్మ పండగ ప్రాంతాల వారిగా భిన్న ఆచార వ్యవహారాలుగా కొనసాగుతుంది.  16 అక్టోబర్ 2020శుక్రవారం, అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మ - నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు.  17 అక్ట...