బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 746 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 747 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (మార్చి 6) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో 'swamyway’లో మీకోసం ముందుగానే. గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే... తన తల్లి దీప.. కనిపించడం లేదని సౌర్య కార్తీక్ ఇంటికి వస్తుంది. ‘అమ్మ కనిపించట్లేదు నాన్నమ్మా... మా అమ్మని ఎవరో బాధపెట్టారు.. ఎక్కడికి వెళ్లిందో తెలియదు.. ఇంట్లో సమాన్లు అన్నీ పిచ్చి పిచ్చిగా పడి ఉన్నాయి.. ఎవ్వరూ తెలియదన్నారు. అమ్మ లేదు. ఏం అయ్యిందో తెలియడట్లేదు. నాకు భయంగా ఉంది’ అంటూ సౌర్య బాగా ఏడుస్తుంది. దాంతో అందరూ వెతికే పనిలో పడతారు. కారులో వెళ్తూ.. ఆదిత్య, మురళీ కృష్ణలు కారులో శ్రావ్యకి టాబ్లెట్స్ తేవడానికి వెళ్తూ ఉంటారు. ‘నిజంగా మీరంతా చాలా మంచివాళ్లు బాబు. శ్రావ్యకి టాబ్లెట్స్ దొరక్కపోతే.. ఇంత దూరం వచ్చి మరీ టాబ్లెట్స్ తీసుకుంటున్నారు మీరు. అయినా ఇంత గొప్పింటి బిడ్డలు నాకు కూతుర్లకు భర్తలుగా రావడం చాలా సంతోషం బాబు. ఇక ఎలాగైనా మనం డాక్టర్ బాబు, ద...