శ్రీ విళంబి నామ సంవత్సర రాశి ఫలితాలు 2018 - 2019. మేష రాశి: అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు , భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు , కృత్తిక నక్షత్రం 1వ పాదము ఆదాయం - 02 వ్యయం - 14 రాజపూజ్యం - 05 అవమానం - 07 మేష రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను కలుగచేయును. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు కష్టంతో ఉద్యోగమును పొందును.విదేశీ ఉద్యోగం ప్రయత్నాలు చేయువారికి సంవత్సర ప్రారంభం లో అంత అనుకూలంగా పరిస్థితులు ఉండవు. వ్యాపార రంగంలోనివారికి ప్రారంభ మాసములలో అధిక వ్యయం, ధన సమస్యలు ఏర్పడి ద్వితీయ భాగంలో తగ్గును. సంతాన ప్రయత్నములు చేయువారికి ప్రయత్న ఆటంకములు ఎదురగును. బాగా ఎదిగిన సంతానం స్థిరత్వం విషయంలో సమస్యలు. నూతన ప్రయత్నాలకు శ్రమానంతర విజయం ఏర్పడును. అశ్రద్ధ వలన ఆరోగ్య సమస్యలు తీవ్రమగును. ఈ సంవత్సరం కోర్టు వ్యవహారాలలో విజయం లభించుట కష్టం. విద్యార్ధులకు ఆశించిన విద్య లభించును. చక్కటి పురోగతి ఏర్పడును. ఉద్యోగ జీవనంలోని వారికి ఆశించిన స్థాన చలనములు లభించును. వస్త్ర వ్యాపారములు, కందెన వ్యాపారములు చేయువారికి నష్టములు. రాజకీయ రంగం వారికి పదవీ లాభం. వ్యవసాయదారులకు రెండు పంటలు ...