కోవిడ్-19 కు వ్యతిరేకంగా భారత ఆర్ధిక వ్యవస్థ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వ్యాపారాలకు, ముఖ్యంగా ఎమ్.ఎస్.ఎమ్.ఈ. లకు సంబంధించిన ఉపశమనం మరియు రుణ మద్దతు కోసం చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఎమ్.ఎస్.ఎం.ఈ. లతో సహా వ్యాపారాలకు 3 లక్షల కోట్ల రూపాయల అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ సదుపాయం. ఒత్తిడికి గురైన ఎమ్.ఎస్.ఎమ్.ఈ.ల కోసం 20,000 కోట్ల రూపాయల సబార్డినేట్ ఋణం. ఎమ్.ఎస్.ఎమ్.ఈ. నిధి ద్వారా 50,000 కోట్ల రూపాయల ఈక్విటీ ఇన్ఫ్యూజన్. ఎమ్.ఎస్.ఎమ్.ఈ. కి కొత్త నిర్వచనం మరియు ఎమ్.ఎస్.ఎమ్.ఈ. కోసం ఇతర చర్యలు. 200 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ టెండర్లకు గ్లోబల్ టెండర్లు అవసరం లేదు. వ్యాపారం మరియు వ్యవస్థీకృత కార్మికులకు ఉద్యోగుల భవిష్యనిధి మద్దతును మరో మూడు నెలలపాటు, జూన్, జులై, ఆగష్టు, 2020 నెలల వేతనాలకు కొనసాగింపు. ఈ.పి.ఎఫ్.ఓ. పరిధిలోకి వచ్చే అన్ని సంస్థల యజమానులకు, ఉద్యోగులకు వచ్చే మూడు నెలలు ఈ.పి.ఎఫ్. చందా 12 శాతం నుండి 10 శాతానికి తగ్గింపు. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్రమోదీ నిన్న 20 లక్షల కోట్ల రూపాయలతో ప్రత్యేక ఆర్ధిక మరియు సమగ్ర...